Allu Aravind Marriage Bureau.. సినిమా గురించి మాట్లాడమంటే, పెళ్ళిళ్ళ గోలేంటసలు.? జస్ట్ సరదాకి.! పెద్దాయన కదా, అప్పుడప్పుడూ ముచ్చటపడుతుంటారు.!
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించే ఇదంతా. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకి సంబంధించిన ఓ ప్రెస్ మీట్‌లో, నటి రుహానీ శర్మ పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చారాయన.
ఇంతకు ముందు నటి లావణ్య త్రిపాఠిని ‘తెలుగబ్బాయిని చేసుకోవచ్చు కదా..’ అంటూ, ఉచిత సలహా ఇచ్చారు. వరుణ్ తేజ్‌కి సతీమణి అయ్యిందిప్పుడు లావణ్య.
నిజానికి, చాలా సరదాగా చేసిన వ్యాఖ్య అది.! వరుణ్ తేజ్‌తో పెళ్ళి పుకార్లు మొదలయ్యాక, ‘తూచ్’ అనేసిన సందర్భాలు చాలానే వున్నాయి లావణ్యకి. చివరికి, లావణ్య – వరుణ్ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
Allu Aravind Marriage Bureau.. చిలసౌ రుహానీ శర్మ..
సరే, ఆ సంగతి పక్కన పెడితే, రుహానీ శర్మ ‘చిలసౌ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. నటుడు సుశాంత్ హీరోగా నటించిన సినిమా అది.
ఆ తర్వాత రుహానీ శర్మ పలు తెలుగు సినిమాల్లో నటించింది. ఓ తెలుగు హీరోతో, ఆమె కొన్నాళ్ళు డేటింగ్ చేసిందనే ప్రచారమూ జరిగింది.
త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నారంటూ రుహానీ, సుశాంత్ గురించి చాలా పుకార్లు షికార్లు చేశాయనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, ఇప్పుడు రుహానీ శర్మ పెళ్ళి ప్రస్తావనని అల్లు అరవింద్ ఎందుకు తెరపైకి తెచ్చినట్లు.? ఏమైనా సమాచారం అల్లు అరవింద్‌కి వుండి వుంటుందా.?
అల్లు అరవింద్‌కే షాకిచ్చారు..
ఇదిలా వుంటే, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ని, ఇదే కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ ర్యాగింగ్ చేశాడు.
‘మీ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పెళ్ళి సంపాదలకు సంబంధించిన బిజినెస్ మొదలు పెట్టండి..’ అంటూ సదరు జర్నలిస్ట్ ఉచిత సలహా ఇచ్చేశాడు.
అల్లు అరవింద్ పెద్ద మనసుతో ఆ ఉచిత సలహాని, ‘స్పోర్టివ్’గా తీసుకున్నారుగానీ, లేదంటే పెద్ద రచ్చ అయిపోయి వుండేది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌కి వున్న రేంజ్ ఏంటి.? పెళ్ళి సంబంధాల వ్యాపారం గీతా ఆర్ట్స్ నుంచి మొదలు పెట్టాలనే బోడి సలహా ఏంటి.?
ఇక్కడ, అల్లు అరవింద్ పెళ్ళి ప్రస్తావన రుహానీ శర్మ విషయంలో తీసుకురావడం వల్లనే ఇదంతా జరిగిందన్నది నిర్వివాదాంశం.
సో, అల్లు అరవింద్ ఇకనైనా ఈ ‘పెళ్ళి పెద్ద’ పనులు మానేసుకుంటే మంచిది.! ఆల్రెడీ ‘పెళ్ళిళ్ళ బ్రోకర్’ అంటూ అల్లు అరవింద్‌ని నెటిజనం ట్రోల్ చేయడం మొదలెట్టేశారు మరి.!