ఇస్మార్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సారి రౌడీస్‌ని మెప్పించే అనౌన్స్‌మెంట్ అది. ఇంతకీ ఏంటా.? ఇస్మార్ట్ అనౌన్స్‌మెంట్. రౌడీస్‌కి ఇది హ్యాపీ న్యూస్. నిజంగానే ఇది బిగ్ న్యూస్. బిగ్ అనౌన్స్‌మెంట్ కూడా. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఇస్మార్ట్ రౌడీ విజయ్ దేవరకొండతో సినిమా (Puri Connects Vijay Deverakonda) రూపొందించనున్నారు.
ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సంచలన విజయం అందుకున్న పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా అంటే, ఆషామాషీ విషయం కాదు. పైగా పూరీ జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిజానికి ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీ జగన్నాధ్ (Puri Jagannath) వద్దకు బోలెడంత మంది నిర్మాతలు క్యూ కట్టారు.
కానీ, ఈ సారి కూడా సొంత బ్యానర్ మీదే సినిమా చేయాలన్నది పూరీ జగన్నాధ్ సంకల్పం. మరోపక్క ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాని పూరీ చేయబోతున్నాడని అందరూ అనుకున్నారు. పూరీ జగన్నాధ్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయాలనే ఆలోచనని బయట పెట్టాడు కూడా. ఏమైందో కానీ, అనూహ్యంగా విజయ్ దేవరకొండతో సినిమా తెరపైకి వచ్చింది.
మహేష్‌బాబుతో తెరకెక్కించాలనుకున్న ‘జనగణమణ’ (Janaganamana) ఇప్పుడు విజయ్ చేతిలోకి వచ్చిందా.? ఇదే చర్చ సర్వత్రా జరుగుతోంది. పూరీ జగన్నాధ్ ఇప్పటిదాకా ఎలాంటి డిటెయిల్స్ ఇవ్వలేదు. మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ని విజయ్ దేవరకొండతో చేస్తాడనే చర్చ జరుగుతోంది.
ఇవేమీ కాదు, ‘ఇడియట్’లాంటి ఓ పవర్‌ఫుల్ లవ్ స్టోరీని విజయ్ దేవరకొండతో (Puri Connects Vijay Deverakonda) పూరీ జగన్నాధ్ చేయబోతున్నాడని అంటున్నారు. ఓ హీరోయిన్‌గా నభా నటేష్ పేరు వినిపిస్తోంది. ఇంకో హీరోయిన్‌ని బాలీవుడ్ నుండి ఇంపోర్ట్ చేస్తారట. తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేయనున్నారని సమాచారమ్.