Home » వైఎస్ జగన్ ‘అరెస్టు పుకార్లు’.! ఈసారేమవుతుందో.!

వైఎస్ జగన్ ‘అరెస్టు పుకార్లు’.! ఈసారేమవుతుందో.!

by Mudra369 Editorial Desk
0 comments
Ys Jagan Mohan Reddy

Arrest Rumors Against Jagan.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టవుతారా.?

జగన్ అరెస్టుకి కు రంగం సిద్ధమంటూ పుకార్లు షికార్లు చేస్తుండడం వెనుక మతలబు ఏంటి.? అసలు జగన్ అరెస్టయ్యే అవకాశాలున్నాయా.?

అప్పుడెప్పుడో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైఎస్ జగన్, పదహారు నెలలు చంచల్‌గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా వున్నారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు.

ఇన్నేళ్ళుగా వైఎస్ జగన్ బెయిల్ మీదనే వున్నారు. విదేశాలకు వెళ్ళాలంటే, ఆయనకు కోర్టు అనుమతి తప్పనిసరి.! ముఖ్యమంత్రి అయినా, ఈ తిప్పలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తప్పలేదు.

Arrest Rumors Against Jagan.. ఏళ్ళ తరబడి నడుస్తూనే…

ఏళ్ళ తరబడి సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘దోషి’గా చూపేందుకు ప్రయత్నిస్తూనే వున్నాయి.

తాజాగా, అటు సీబీఐ.. ఇటు ఈడీ.. ఈ రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించిన కేసుల్ని రోజువారీగా విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.

దాంతో, ఏ క్షణమైనా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏదో ఒక కేసులో అరెస్టవుతారన్న ప్రచారం ఇంకోసారి ఊపందుకుంది.

అయితే, వచ్చే ఏడాది చివర్లో పాదయాత్రకు సమాయత్తమవుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ‘క్లీన్ చిట్ రాబోతోంది’ అంటూ వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.

దెబ్బకు దెబ్బ..

తన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరెస్టు చేయించారు.

సో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా ఈసారి అరెస్టు చేయించి తీరతారన్న ప్రచారం ఇప్పుడు జోరందుకోవడంలో వింతేమీ లేదు.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గతంలో నమోదైన అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో, చంద్రబాబు కొత్తగా అరెస్టు చేయించేదేమీ వుండదు.

కానీ, లిక్కర్ స్కామ్ సహా పలు కేసులకు సంబంధించి వైఎస్ జగన్ ఏ క్షణమైనా అరెస్టవ్వొచ్చన్నది టీడీపీ శ్రేణుల ఉవాచ.

స్థానిక పోరు.. అరెస్టుల పుకారు..

స్థానిక ఎన్నికల సమర శంఖారావం ఇప్పటికే షురూ అయిన దరిమిలా, వైఎస్ జగన్ అరెస్టు పుకార్లకు కొత్త బలం వచ్చినట్లయ్యింది.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! అరెస్టు వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అదనంగా వచ్చే నష్టమేమీ లేదు.

పైగా, సింపతీ వర్కవుట్ అయితే, రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ ‘అరెస్టు’ కొంత మేలు చేయొచ్చు కూడా.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group