Pawan Kalyan Political POWER.. ‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్.. రెండు పడవలపై ప్రయాణం చేయగల సమర్థుడు’ కొన్నేళ్ళ క్రితం, పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి చెప్పిన మాటలివి.
‘అటు రాజకీయాల్లోనూ, ఇటు సినీ రంగంలోనూ పవన్ కల్యాణ్ కొనసాగగలడు. నాకు అలా వీలు పడలేదు..’ అని చిరంజీవి, ఓ సినీ వేదికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం క్రితం.
అప్పట్లో, మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల్ని చాలామంది లైట్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళాక, సినీ పరిశ్రమకు చిరంజీవి గుడ్ బై చెప్పడమే అందుక్కారణం.
తిరిగి, సినిమాల్లోకి వచ్చాక.. పూర్తిగా రాజకీయాల్ని వదిలేశారు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి. సినిమా, రాజకీయం.. ఒకదానితో, ఒకటి పొసగని రంగాలన్న భావన కొందరిలో వుంది.
కానీ, బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, సినీ రంగంలో రాణిస్తున్నారు కదా.? అంటే, వేరే పార్టీలో వుండి సినిమాల్లో కొనసాగడం వేరు.. కొత్త రాజకీయ పార్టీ స్థాపించి, సినిమాల్లో కొనసాగడం వేరు.
Pawan Kalyan Political POWER.. ఇటు రాజకీయం.. అటు సినిమా..
అసలు విషయానికొస్తే, ఏపీ డిప్యూటీ సీఎంగా ఓ వైపు కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇంకో వైపు సినిమాల్లో కొనసాగుతున్నారు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాను. నేను పవర్ స్టార్‌ని కాదు. గెలిచాక, చెప్పుకుందాం పవర్ స్టార్ అని’ అంటూ గతంలో పవన్ కళ్యాణ్ అంటుండేవారు.

కానీ, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత, నేషనల్ మీడియానే, ‘పొలిటికల్ పవర్ స్టార్’ అని పవన్ కళ్యాణ్‌ని పేర్కొనడం గమనార్హం.
ఇదిలా వుంటే, తాజాగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ‘స్వాగ్’ చూసి సహచర మంత్రులు ఆశ్చర్యపోయారు. అదే, పైన మీరు చూస్తున్న ఫొటో.
Also Read: Maranamass Telugu Review: హాస్యంతో కూడిన బీభత్సం.!
ఇంకో ఫొటో, ‘హరి హర వీర మల్లు’ సినిమాకి సంబంధించినది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సంబంధిత విషయాలపై, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పవన్ కళ్యాణ్ మంతనాలకు సంబంధించినది.
రాజకీయం అయినా, సినిమా అయినా.. పవన్ కళ్యాణ్ ‘స్వాగ్’ వేరే లెవల్.. అని చెప్పడానికి, ఈ రెండు ఫొటోలే నిదర్శనం.! ‘
హరి హర వీర మల్లు’ షూటింగ్‌ని ఇటీవల పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ‘ఓజీ’ సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.