శ్రీముఖి బిగ్ హౌస్‌లో (Bigg Boss 3 Telugu) ఏం చేసినా చెల్లిపోతోంది.. అదే రాహుల్ సిప్లిగంజ్ ‘క్షమాపణ’ (Nagarjuna Sree Mukhi Rahul) చెప్పినా అదో పెద్ద నేరంగా మారిపోతోంది. అసలేం జరుగుతోంది బిగ్ హౌస్‌లో.? శ్రీముఖి పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించడమేంటి.? రాహుల్ సిప్లిగంజ్ని పదే పదే టార్గెట్ చేయడమేంటి.?
తాజా వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా శ్రీముఖి – రాహుల్ సిప్లిగంజ్ విషయంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో శ్రీముఖి – రాహుల్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ‘ఫాల్తు’ అనే ప్రస్తావన రాహుల్ నుంచి రావడాన్ని నాగ్ తీవ్రంగా ఖండించాడు.
అంతే కాదు, శ్రీముఖి (Sree Mukhi) యాంకరింగ్ ప్రొఫెషన్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యల్నీ తప్పుపట్టాడు. అక్కడి వరకూ ఓకే. కానీ, రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) తనంతట తానుగా శ్రీముఖికి ఈ మధ్యనే బిగ్ హౌస్‌లో క్షమాపణ చెబితే, దాంట్లో ‘తప్పుల్ని’ నాగ్ వెతకడమేంటి.? ఇదీ రాహుల్ అభిమానుల ప్రశ్న.
రాహుల్‌ని అభిమానించేవారు మాత్రమే కాదు, బిగ్‌హౌస్‌ని ఫాలో అవుతోన్న చాలామంది సాధారణ ప్రేక్షకులూ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీముఖిని నాగార్జున వెనకేసుకురావడం సుస్పష్టం. కానీ, రాహుల్‌ని నాగ్ టార్గెట్ చేస్తుండడం చాలామందికి నచ్చడంలేదు.
అఫ్కోర్స్, హౌస్‌లో ఏం జరుగుతోందో పూర్తిగా మనం తెలుసుకునే అవకాశం లేదు. అక్కడ టెలికాస్ట్ అయ్యేది మాత్రమే మనకి తెలుస్తుంది. మొత్తం ఫుటేజ్ అంతా తాను చూస్తున్నట్లు నాగ్ చెబుతున్నాడు. అయినాగానీ, టెలికాస్ట్ అయ్యే వ్యవహారాన్ని బట్టి నాగ్ పరిస్థితిని ‘జడ్జ్’ చేస్తేనే కదా, హోస్ట్‌గా సక్సెస్ అయినట్లు.? ఊరికే, రాహుల్ మీద నిందలేసేస్తే ఎలా.?
శ్రీముఖికి రాహుల్ క్షమాపణ చెప్పాడు, దాన్ని శ్రీముఖి లైట్ తీసుకుంది. ఇక్కడ తప్పు ఎవరిదో స్పష్టమయిపోయింది. పెద్ద మనసు చేసుకుని క్షమించాల్సిన శ్రీముఖి, క్షమించేది లేదని తేల్చేశాక రాహుల్ చెయ్యగలిగేదేమీ వుండదు.
తన అసహనాన్ని ఇంకో హౌస్ మేట్ దగ్గర చెప్పుకునే అవకాశం రాహుల్‌కి లేకపోతే ఎలా.? దాన్ని నాగ్ తప్పు పట్టడం (Nagarjuna Sree Mukhi Rahul) ఎంతవరకు సమంజసం.? రాహుల్ క్షమాపణలో నాగ్‌కి నిజాయితీ కన్పించకపోవడం హాస్యాస్పదం. ఎందుకంటే, అక్కడ జరుగుతున్నది ఓ గేమ్ షో (Bigg Boss Telugu 3). ఎవరి గోల వారిదే.