బిగ్‌బాస్ గేమ్ షోలో లేటెస్ట్ వికెట్ రోహిణిది. రోహిణి (Sree Mukhi Rohini) హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడాన్ని హిట్ వికెట్‌గా అభివర్ణించాలా.? అంపైరింగ్‌లోనే లోపాలున్నాయి అనుకోవాలా.? ఇవేమీ కాదు.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా.? చాలా మంది అభిప్రాయాలు మాత్రం ఎక్కడో తేడా జరిగిందని.
ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వకముందే, రోహిణి వికెట్ పడిపోవచ్చని, సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. శివజ్యోతికి (Siva Jyothy)కూడా, ఈ విషయంలో ఎక్కువ మంది శివజ్యోతికి యాంటీగా ఓట్లేశారు. నిజానికి శివజ్యోతి అవుట్ అవ్వాల్సి ఉండగా, ఈక్వేషన్స్ మారి, రోహిణి ఎలిమినేట్ అయిపోయింది.
అయితే, బిగ్‌హౌస్‌లో శ్రీముఖి (Sree Mukhi) మైండ్ గేమ్ రోహిణి పట్ల వ్యతిరేకతను పెంచింది. రోహిణి, ఎలిమినేట్ అయిపోతుందని శ్రీముఖి ముందే ఊహించడం, దానికి తగ్గట్లే రోహిణి ఎలిమినేట్ అయిపోవడం, కొత్త అనుమానాలకు తావిస్తోంది. బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్ల మీద నెగిటివ్ ఇమేజ్ పడడానికి కారకులెవరు.? అని లెక్కలు తేలిస్తే, శ్రీముఖి అనే తేలుతుందని అంటున్నారు చాలామంది.
గేమ్ ఆడే క్రమంలో శ్రీముఖి ఒక్కొక్కర్ని అలా కార్నర్ చేసేస్తుందని కంటెస్టెంట్లే అంటున్నారు. ఇదే అభిప్రాయం సోషల్ మీడియాలోనూ వ్యక్తమవుతోంది. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాకా, రోహిణి, శ్రీముఖికి 50 మార్కులు మాత్రమే ఇచ్చింది.
అసలు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌లోకి తాను రావడానికి కారణమైన గుసగుసల ఎపిసోడ్‌లో శివజ్యోతికి ఫుల్ మార్కులు ఇచ్చింది. శ్రీముఖి (Sree Mukhi Rohini), తాను రియల్ లైఫ్‌లో మంచి ఫ్రెండ్స్ అనీ, కానీ, ఇక్కడ ఎందుకో శ్రీముఖి పద్దతి తనకు నచ్చలేదని రోహిణి కుండ బద్దలు కొట్టేసింది.