Home » పిలిచి, ఛాన్స్ ఇచ్చారు.! తీసేసి, అన్యాయం చేశారు.!

పిలిచి, ఛాన్స్ ఇచ్చారు.! తీసేసి, అన్యాయం చేశారు.!

by Mudra369 Editorial Desk
0 comments
Pujita Ponnada

Pujita Ponnada Trivikram Shock.. మొన్నీమధ్యనే సీనియర్ నటుడు బాబూమోహన్, ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం తనతో లుక్ టెస్ట్ చేయించారనీ, కానీ సినిమాలో వేషం ఇవ్వలేదని ఆవేదన వెల్లగక్కారు.!

తాజాగా, సినీ నటి పూజిత పొన్నాడ ఓ సినిమాలో తనకు అవకాశం వచ్చినట్లే వచ్చి, చేజారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

‘సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ జరిగింది.. ఆ షూటింగ్‌లో పాల్గొన్నాను. కానీ, రెండో షెడ్యూల్‌కి పిలుపు రాలేదు’ అంటూ పూజిత పొన్నాడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఛాన్స్ అలా వచ్చినట్లే వచ్చి, ఇలా చేజారిపోయిందన్నది పూజిత పొన్నాడ ఆవేదన.

Pujita Ponnada Trivikram Shock.. మెగాస్టార్ చిరంజీవికే తప్పలేదు..

నిజానికి, ఇలాంటివి సినీ పరిశ్రమలో సర్వసాధారణం. మెగాస్టార్ చిరంజీవితో నిర్మంచ తలపెట్టిన సినిమాలే కొన్ని, అర్థాంతరంగా ఆగిపోయాయి.

పెద్ద పెద్ద హీరోలకే తప్పలేదు ఈ తిప్పలు.! హీరోయిన్లు చివరి నిమిషంలో మారిపోతారు.. కథలు ఓ హీరో నుంచి, ఇంకో హీరోకి వెళతాయి.. ఇవన్నీ చాలా సాధారణ విషయాలే.

అంతెందుకు, ‘ఆచార్య’ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ పాత్రని లేపేశారు. సినిమా రిలీజ్ అయ్యాక, నటీనటుల సన్నివేశాల్ని లేపేసిన సందర్భాలూ కోకొల్లలు.

కాకపోతే, ఇలాంటివి కొన్ని సందర్భాల్లో అప్‌కమింగ్ నటీనటులకు శాపంగా మారతాయి. పూజిత పొన్నాడ ఆవేదన కూడా అదే. బాబూమోహన్ లాంటి సీనియర్లు, దీన్ని అవమానంగా భావించడమూ తప్పు కాదు.

సినిమా ఈక్వేషన్స్ అలా అలా మారిపోతుంటాయ్..

సినిమా అంటే, అదొక కళాత్మక వ్యాపారం.! ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. చివరి నిమిషంలో ఎడిటింగ్‌లో కత్తెర వేటుకు గురయ్యే పాత్రలు కొన్నయితే, మధ్యలోనే పోయేవి ఇంకొన్ని.

సోషల్ మీడియా, యూ ట్యూబ్ ఛానల్స్.. వీటి పుణ్యమా అని ఇలాంటి వార్తలకి క్రేజ్ విపరీతంగా పెరుగుతుంటుంది. ట్రోలింగ్ సంగతి సరే సరి.!

నటీనటులకు రెమ్యునరేషన్లు ఇచ్చి, సినిమాల్లోంచి వాళ్ళను మార్చేయాలంటే ఏ నిర్మాతకి అయినా కష్టమే. ఓ సారి షూట్ చేసిన పార్ట్, మళ్ళీ ఇంకొకరితో షూట్ చేయాలంటే, దర్శకులకెంత కష్టం.

పూజిత పొన్నాడ విషయానికొస్తే, తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయ్. వచ్చిన, ఆ అరుదైన కొన్ని అవకాశాల్లోనే, ఇలాంటివి చేజారిపోతే.. అదింకా కష్టం.

రకుల్ ప్రీత్ సింగ్, మెహ్రీన్.. ఇలా చాలామంది హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. కొందరు లైట్ తీసుకుంటారు, కొందరు, తమకు జరిగిన అన్యాయాన్ని తెరపైకి తెస్తుంటారు.

కొన్ని కొన్ని జరుగుతుంటాయ్. అదంతే.! ఇదీ సినిమా మ్యాజిక్కు.. అని సరిపెట్టుకోవాల్సిందే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group