Home » ‘అన్బిల్ అవన్’ రివ్యూ: రొమాంటిక్ హింసాత్మక థ్రిల్లర్.!

‘అన్బిల్ అవన్’ రివ్యూ: రొమాంటిక్ హింసాత్మక థ్రిల్లర్.!

by Mudra369 Editorial Desk
0 comments
Anbil Avan Review

Anbil Avan Telugu Review.. సినిమా భలే రొమాంటిక్‌గా వుందనిపిస్తుంది.. అంతలోనే, సినిమా మొత్తం కొత్త టర్న్ తీసుకుంది. హర్రర్ సినిమానా.? అన్న డౌట్ కలుగుతుంది.!

అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ జంతగా నటించిన ‘అన్బిల్ అవన్’ సినిమా గురించే ఇదంతా.! ఓటీటీ యుగంలో, సినిమాకి భాషతో సంబంధం లేదు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే.

అశోక్ సెల్వన్ మంచి నటుడు. ప్రీతి ముకుందన్ సరే సరి.! ఈ జంట, సినిమా ప్రమోషన్లలో చాలా యాక్టివ్‌గా కనిపించింది. సినిమా ప్రోమోస్ కూడా ఆకట్టుకున్నాయి.

దాంతో, సహజంగానే ‘అన్బిల్ అవన్’ సినిమాపై అంచనాలు పెరిగాయి. థియేటర్లలో రిజల్ట్ సంగతెలా వున్నా, ఓటీటీ రిలీజ్ కోసం సగటు సినీ అభిమాని ఒకింత ఉత్సుకతతోనే ఎదురు చూశాడు.

Anbil Avan Telugu Review.. కథేంటంటే..

భార్యాభర్తలిరువురూ వేర్వేరు ఉద్యోగాలు చేస్తుంటారు. ఆ బిజీ లైఫ్ నుంచి, చిన్నపాటి ఛేంజ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే, భార్య కోరికని నెరవేర్చాలనుకుంటాడు భర్త.

చేస్తున్న ఉద్యోగాలు మానేసి, ఉన్నదంతా ఊడ్చేసి.. ఓ ‘హోమ్ స్టే’ని ప్రారంభిద్దామనుకుంటారు. ఈ క్రమంలో అనువైన ఇంటిని చూస్తారు.

నగర జీవనానికి దూరంగా, ప్రకృతిలో మమేకమయ్యేలా వుండే, ఆ ఇంటిని దక్కించుకునేందుకు, ఇంటి యజమానిని ఒప్పించడమే కష్టమవుతుంది.

Anbil Avan Review
Anbil Avan Review

ఆ తర్వాతే, అసలు కథ మొదలవుతుంది. స్థానికంగా రాజకీయ నాయకుల పెత్తనాలు, అవినీతి.. వెరసి, ‘హోమ్ స్టే’ ప్రయత్నాలు కఠిన పరిస్థితుల్లోకి ఆ జంటని నెట్టేస్తాయి.

వ్యవహారం, ప్రాణాపాయం వరకూ వెళుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలూ పెరిగిపోతాయి. ఈ జంట విడిపోయిందా.? ప్రాణాపాయం నుంచి బయటపడిందా.? అన్నది తెరపైనే చూడాలి.

నటీనటులెలా చేశారంటే..

ముందే చెప్పుకున్నాం కదా.. అశోక్ సెల్వన్ మంచి నటుడు. ప్రీతి ముకుందన్ కూడా మంచి నటి. ఇద్దరూ తమ తమ పాత్రల్లో నటించలేదు, జీవించేశాడు.

‘బ్లాస్ట్’ సినిమాలో ప్రీతి ముకుందన్‌ని చూసిన మనకి, సినిమాలో త్వరగా ప్రీతి ముకుందన్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చెయ్యాలనుకుంటాం.

చిత్రంగా హీరో అశోక్ సెల్వన్ కూడా, యాక్షన్ మోడ్‌లోకి ఎంతకీ రాకపోవడంతో చిరాకు వస్తుంది. అయినాసరే, నటీనటులిద్దరూ తమ నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు.

మరోపక్క, నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలకు బలాన్నిచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ బాగా పని చెయ్యడంతో, దర్శకుడి పని తేలికయ్యింది.

ప్రొడక్షన్ డిజైన్ బావుంది. కొన్ని సన్నివేశాలు సాగతీత అనిపిస్తాయి.. వాటికి కాస్త కత్తెర వేసి వుండాల్సింది.. ఎడిటింగ్ ఈ విషయంలో యావరేజ్, ఎబౌ యావరేజ్.. అనిపిస్తుంది.

ఇలా మొదలై.. అలా ముగిసి..

యాక్షన్ ఎపిసోడ్‌ని బాగానే డిజైన్ చేశారు. ఆకట్టుకుంటుదది. కాకపోతే, ప్రిడిక్టబుల్‌గా వుంటుంది సెకెండాఫ్ చాలావరకు. దాదాపుగా కీలక సన్నివేశాలన్నీ, ఏవో సినిమాల్లో చూసినట్లే వుంటాయ్.

కొంచెం నిడివి తగ్గించగలిగి వుంటే, ఇంకాస్త బెస్ట్ రిజల్ట్ వచ్చి వుండేవి. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్‌ని కమర్షియల్ యాంగిల్‌లో ఆడియన్స్ కోరుకోవడం తప్పేమీ కాదు. అలా కోరుకున్నవాళ్లకి నిరాశే.

రొమాంటిక్ సినిమానే అనిపిస్తుంది.. కానీ, అంతలోనే థ్రిల్లింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది.. చివరికి యాక్షన్ డ్రామాగా ముగుస్తుంది.

అశ్లీలమేమీ లేదు.. హింస మరీ మోతాదు దాటెయ్యలేదు.. దారుణంగా నరికేసుకోవడాలు.. శరీర భాగాలు తెగబడ్డాలు.. ఇవేవీ లేవు. ఆ విషయంలో మెచ్చుకుని తీరాలి.

ఓవరాల్‌గా ఓటీటీలో చూసేవాళ్ళని ఏమాత్రం నిరాశపర్చదు ‘అన్బిల్ అవన్’.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group