Home » బిగ్ క్వశ్చన్: గల్లా పట్టుకుని జగన్‌ని కేసీయార్ బెదిరించారా.?

బిగ్ క్వశ్చన్: గల్లా పట్టుకుని జగన్‌ని కేసీయార్ బెదిరించారా.?

by Mudra369 Editorial Desk
0 comments
Ys Jagan Mohan Reddy

KCR Humiliated Jagan.. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళతో కొట్టి తరిమేసిన పరిస్థితుల్ని చూశాం. ఈ అనుభవం స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ఎదురైంది.

అప్పటితో, తెలంగాణలో రాజకీయాలు చేయాలన్న ఆలోచనని దాదాపుగా వైఎస్ జగన్ విరమించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వైసీపీ లేదు.

కానీ, 2019 ఎన్నికల సమయంలో వైసీపీ, బీఆర్ఎస్ (ఒకప్పటి టీఆర్ఎస్) కలిసి పని చేశాయి. తెలంగాణలో అంతకు ముందు గులాబీ పార్టీకి వైసీపీ సాయం చేసింది.. అందుకే వైసీపీకి కారు పార్టీ సాయం చేసింది.

కేసీయార్, జగన్.. కలిసి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా పన్నిన రాజకీయ కుట్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

కట్ చేస్తే, జగన్‌ని కేసీయార్ గల్లా పట్టుకుని బెదిరించారంటూ తాజాగా ఓ వాదన తెరపైకొచ్చింది.

స్వయానా కేసీయార్ మేనల్లుడు, తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

KCR Humiliated Jagan.. గల్లా పట్టుకోవడమంటే.! నిజంగానేనా.?

నీటి ప్రాజెక్టుల విషయమై కేసీయార్‌ని ఎలివేట్ చేసే క్రమంలో, తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టే క్రమంలో, హరీష్ రావు చేసిన పద ప్రయోగం వివాదాస్పదమయ్యింది.

కేంద్ర మంత్రి సమక్షంలోనే వైఎస్ జగన్ గల్లా పట్టుకుని మరీ.. అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. ‘గల్లా పట్టుకుని’ అంటే, నిజంగానే గల్లా పట్టుకున్నారా.? అన్న ప్రశ్న తెరపైకి రావడంలో వింతేముంది.?

గట్టిగా నిలదీశారని అర్థం గల్లా పట్టుకుని అడిగారంటే. అయినా, ఓ ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి ముఖాముఖి వున్నప్పుడు ఇంత తీవ్రంగా నిలదీయడం, అదీ కేంద్ర మంత్రి సమక్షంలో.. సాధ్యమేనా.?

KCR BRS Andhra Pradesh
KCR BRS Andhra Pradesh

అలా గల్లా పట్టుకుని నిలదీసి, ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాల్ని (నీటి తరలింపుని) కేసీయార్ అడ్డుకున్నారన్నది హరీష్ రావు ఉద్దేశ్యం. అంటే, అక్కడ ఏపీకి అన్యాయం జరిగినట్లే కదా.!

సో, ఇప్పుడు ఈ విషయమై స్పందించాల్సింది సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! ఎందుకంటే, హరీష్ రావు అంటే, ఆషామాషీ వ్యక్తి కాదు.

తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత కీలక భూమిక పోషించారు అప్పట్లో హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలోనూ హరీష్ రావుది కీలక పాత్ర.

నిర్లజ్జగా తిట్టుకుంటున్నారు..

ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో వైసీపీ శ్రేణులకీ, బీఆర్ఎస్ శ్రేణులకీ మధ్య సోషల్ మీడియాలో పెద్ద గొడవే మొదలైంది.

నిన్న మొన్నటిదాకా కలిసి పని చేస్తున్న, ఈ రెండు పార్టీల సోషల్ మీడియా టీమ్స్ పరస్పరం దూషణలకు దిగాయి. అనూహ్యంగా, వివాదాన్ని ఇక్కడితో ఆపేసేందుకు, ఇరు పార్టీల అధినాయకత్వాలూ రంగంలోకి దిగాయి.

‘అయ్యిందేదో అయిపోయింది.. వివాదానికి ఇక్కడితో ముగింపు పలికేద్దాం..’ అని ఇరు పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తల నుంచి ప్రకటనలు వస్తుండడం గమనార్హం.

రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదిది, కేసీయార్ ఒత్తిళ్ళకు తలొగ్గి, భయపడి, బెదిరిపోయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ అన్యాయం చేశారా.? అన్నది తేలాలిప్పుడు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group