Kushitha Kallapu: క్రికెట్ మైదానంలో అందాల కనికట్టు.!

Kushitha Kallapu
Kushitha Kallapu IPL 2024.. మైదానంలో ఆటగాళ్ళు.. గ్యాలరీల్లో అందగత్తెలు.. క్రికెట్టు.. గ్లామరు.. ఇలా చెప్పుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. చాలాకాలంగా జరుగుతున్న వ్యవహారమే.!
అసలు సంగతేంటంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల సందర్భంగా, హైద్రాబాద్ టీమ్‌కి మద్దతుగా బోల్డంతమంది అందాల భామలు సందడి చేస్తున్నారు.
అబ్బే, నాకసలు క్రికెట్ మీద ఆసక్తి లేదు.. అని కొందరు అంటోంటే, ఇంకొందరు మాత్రం, క్రికెట్ అంటే తమకు పిచ్చి.. అని చెబుతున్నారు.!
చక్కనమ్మ ఏం చెప్పినా అందమే.! కాదు కాదు, చక్కనమ్మ ఏం చేసినా అందమే.!
Kushitha Kallapu IPL 2024.. కుషితానందం.!
కుషిత కల్లపు.. ఆ మధ్య ఓ పబ్ మీద పోలీసులు దాడులు చేస్తే, అప్పట్లో ఈ బ్యూటీ పేరు మార్మోగిపోయింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే వుంది ఈ బ్యూటీ ఫొటోలు, వీడియోలతో.!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ జట్టుకి చీర్స్ చెబుతూ.. ఇదిగో స్టేడియంలో ఇలా సందడి చేస్తోంది కుషిత.
‘మీకు తెలుసా.? కుషిత వల్లనే సన్ రైజర్స్ జట్టు అత్యద్భుత విజయాలు సాధిస్తోంది..’ అంటూ ఆమె అభిమానులు, కుషితని ఆకాశానికెత్తేస్తున్నారు.

సర్లే, అదంతా టీజింగ్ వ్యవహారం లాంటిదేననుకోండి.. అది వేరే సంగతి.!
చూస్తున్నారు కదా.. కుషిత క్రికెట్ సందడి ఫొటోలు.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, సినిమాల్లో ఇంకా కుషితకి రావాల్సిన బ్రేక్ అయితే రాలేదు.!
ముంబై భామలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ కుషిత సొంతం.! టైమ్ కలిసి రావాలంతే.! వచ్చేసిందని అనుకోవచ్చా.? అంతేనేమో.!
