Dimple Hayathi Eyes Focus.. ఓ చిన్న సినిమాలో నటించింది.. ఆ తర్వాత ఐటమ్ సాంగ్ చేసింది. పదహారణాల తెలుగమ్మాయ్ డింపుల్ హయాతీ గురించే ఇదంతా.!
డింపుల్ హయాతీ అంటే, గ్లామర్.. ఓన్లీ గ్లామర్.! బికినీ దగ్గర్నుంచి.. గ్లామర్ షో చేయడంలో, ఏ స్థాయికి అయినా వెళ్ళిపోయిందామె.!
ఇంతకీ, తప్పెవరిది.? నటిగా ఆమెలో నటనా ప్రతిభని ఎవరూ గుర్తించలేదా.? గుర్తించకపోతే హీరోయిన్‌గా ఛాన్సులు ఎలా వస్తున్నాయ్.?
ఛాన్సులు వస్తున్నాయ్ సరే, కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే ఆ సినిమాల్లో ఆమెకు ఆఫర్ చేయబడుతున్నాయ్.
‘మొదటిసారి, ఓ దర్శకుడు నా కళ్ళ మీద ఫోకస్ పెట్టారు’ అని, డింపుల్ హయాతీ తాజాగా చెప్పుకోవాల్సి వచ్చింది. దాంతో, ఇప్పటిదాకా దర్శకులు చేసిందేంటి.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.
సంపత్ నంది రూటే సెపరేటు..
అలా, డింపుల్ హయాతీ కళ్ళ మీద ఫోకస్ పెట్టిన దర్శకుడు ఎవరో కాదు, సంపత్ నంది.! నిజానికి, సంపత్ నంది సినిమాల్లో హీరోయిన్లు గ్లామరస్‌గా వుంటారు.
గతంలో, తమన్నాతో గ్లామరస్ సినిమాలు చేశాడు సంపత్ నంది. అదే సంపత్ నంది, ఓ సినిమాలో తమన్నాతో దైవ శక్తి వున్న సాద్విగా చూపించిన సంగతి తెలిసిందే.
ఇక, ఇప్పుడు తన తాజా చిత్రం ‘భోగీ’ కోసం, డింపుల్ హయాతీ కళ్ళ మీద ఫోకస్ పెట్టాడట సంపత్ నంది. ఈ విషయాన్ని స్వయంగా ‘భోగీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించింది డింపుల్ హయాతీ.

నిజమే, డింపుల్ హయాతీ కళ్ళు చాలా ఎక్స్‌ప్రెసివ్.! ఆమె మంచి నటి కూడా.! గ్లామరస్ పాత్రలు వచ్చాయి.. చేసుకుంటూ వెళ్ళింది.!
అన్నట్టు, వల్గారిటీ అస్సలు లేకుండా డింపుల్ హయాతీతో ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తానని గతంలోనే దర్శకుడు సంపత్ నంది ఆమెకు హామీ ఇచ్చాడట.
‘ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు.. కానీ, భవిష్యత్తులో నిలబెట్టుకుంటాను..’ అంటూ సంపత్ నంది, డింపుల్ హయాతీకి ‘భోగీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో తాజాగా హామీ ఇచ్చాడు.