బిగ్‌హౌస్‌లో (Bigg Boss 3 Telugu) అప్పుడప్పుడూ క్యూట్‌గా వీలున్నప్పుడు ఇంకాస్త హాట్‌గా.. అవకాశం దొరికితే అసహనంతో రెచ్చిపోయే శివంగిగా.. ఇలా ఎన్నెన్నో అవతారాల్లో కన్పించే పునర్నవి భూపాలంపై (Bigg Boss Punarnavi Hot) ‘బ్యాడ్ రిమార్క్’ ఒకటి వుంది. అదేంటో తెలుసా.? ఆ విషయాన్ని హోస్ట్ నాగార్జున ఈ వీకెండ్లో వెలికి తీశాడు.
పునర్నవి (Punarnavi Bhupalam) టాస్క్‌లలో సరిగ్గా పార్టిసిపేట్ చేయడంలేదన్నది నాగ్ ఆరోపణ. అది ఉత్త ఆరోపణ మాత్రమే కాదు, నిజం కూడా. ఆ విషయాన్ని పునర్నవి కూడా ఒప్పుకుంది. ఇకనేం, పునర్నవికి ‘అంపైరింగ్’ బహుమతి కూడా దక్కేసింది. ఇకపై టాస్క్‌లలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తానని పునర్నవి స్పష్టం చేసింది.
అంతే కాదండోయ్, పునర్నవి (Punarnavi Panthers) ముక్కోపి.. అన్న విషయాన్ని ఆమెతోనే చెప్పించాడు నాగార్జున. ఈ విషయంలో నాగార్జునకి ఫుల్ మార్క్స్ వేసెయ్యొచ్చు. ఇదిలా వుంటే, పునర్నవికి నాగార్జున ఓ స్వీట్ పనిష్మెంట్ కూడా ఇచ్చేశాడు.
వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా కంటెస్టెంట్స్‌కి ఇచ్చిన అవార్డులన్నిటినీ సందర్భానుసారం పునర్నవితోనే తెప్పించిన నాగ్, ‘ఇలా అయినా యాక్టివ్ అవుతావులే..’ అంటూ చిన్న ఫన్ టచ్ ఇచ్చాడు. హౌస్‌లో (Bigg Boss Telugu 3) ‘అలక’ తగ్గించుకోవాలనీ, అది ఖచ్చితంగా నెగెటివ్ షేడ్‌ని చూపిస్తుందనీ పునర్నవికి చురకలంటించాడు నాగార్జున.
‘నవ్వితే నువ్వు ఎంత అందంగా వుంటావో తెలుసా..’ అంటూ నాగార్జున అనేసరికి, పునర్నవిలో (Bigg Boss Punarnavi Hot) ఎక్కడ లేని ఆనందం పొంగుకొచ్చింది. ఇదిలా వుంటే, హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి రకరకాల బహుమతుల్ని (అవార్డుల రూపంలో) అందించాడు కింగ్ నాగార్జున.
శ్రీముఖి – లౌడ్ స్పీకర్, శివజ్యోతి – ఉల్లిపాయ, మహేష్ – అగ్గిపుల్ల, వితిక – బూతద్దం, అలీ – ఫ్లూటు, రోహిణి – కత్తెర, అషు రెడ్డి – అరటిపండు, బాబా భాస్కర్ – ప్రెషర్ కుక్కర్, రాహుల్ – బిగ్ మౌత్, వరుణ్ – ఫ్రూట్, హిమజ – చిచ్చుబుడ్డి, రవి – ఇయర్ (చెవి) బహుమతుల్ని అందుకున్నారు. వాటికి నాగ్ చెప్పిన రీజన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా వున్నాయి.
ఓవరాల్‌గా ఈ వీకెండ్ ఎపిసోడ్లో మొదటి రోజు (శనివారం) నాగార్జున ఫుల్ ఫన్‌తో నడిపాడు. కాగా, హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ లిస్ట్ నుంచి ఇద్దరికి ఉపశమనం కలిగింది. వరుణ్ సందేశ్, శివజ్యోతి ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి సేఫ్ అయ్యారు.