Table of Contents
అంతా అనుకున్నట్టే జరిగింది. అషు రెడ్డి బిగ్ హౌస్ (Bigg Boss 3 Telugu) నుంచి ఎలిమినేట్ అయిపోయింది. తాను ఎలిమినేట్ అయిపోవడం ఖాయమని ముందే తెలిసిపోయిందేమో, అషు రెడ్డి (Ashu Reddy Eliminated) కాస్తంత డిఫరెంట్‌గానే కన్పించింది హౌస్‌లో గత వారం రోజులూ. తన సహజ శైలికి భిన్నంగా హౌస్‌లో వ్యవహరించింది.
కొంచెం యాక్టివ్ అయ్యింది. ‘ఓ రెండు వారాల ముందు ఇంత యాక్టివ్‌గా వుండడం మొదలు పెడిటే బావుండేది’ అని ఎలిమినేట్ అయిపోయాక ఆత్మవిమర్శ చేసుకుంది అషు రెడ్డి. ఆదివారం ఎపిసోడ్ ఒకింత కలర్‌ఫుల్‌గానే స్టార్ట్ అయ్యింది. హోస్ట్ నాగార్జున ‘యో..యో..యో..’ అంటూ ఎపిసోడ్ షురూ చేశాడు.
Click Here: హిమజ – అషూ రెడ్డి.. పడేది ఎవరి వికెట్.?
శివజ్యోతిని ఆకాశానికెత్తేస్తూ, ‘ఆడ పిల్ల చేతికి పవర్ ఇస్తే ఏమవుతుందో చేసి చూపిద్దాం..’ అంటూ ఓ ఫన్ టాస్క్‌తో మొదలెట్టాడు నాగార్జున. అషు రెడ్డి, ట్రెడిషనల్ వేర్‌ని నాగ్ ప్రత్యేకంగా పొగడటం వెనుక అసలు ఉద్దేశ్యమేంటో, ఆమె ఎలిమినేట్ అయ్యాకే అర్థమయ్యింది అందరికీ. జంతువులు – మాస్క్‌లు – రీజన్స్.. అంటూ టాస్క్ వ్యవహారం మొదలయ్యింది.
అలీకి లయన్ ఫేస్ పెట్టడంతో శివ జ్యోతి టాస్క్ మొదలు పెట్టింది. మరోపక్క ఒకరిలా, ఇంకొకరు యాక్ట్ చేసే టాస్క్ జరిగింది. మొదటి టాస్క్, రెండో టాస్క్.. రెండూ ‘మమ’ అన్పించేశాయంతే. నాగార్జున (Akkineni Nagarjuna) హంగామా, హౌస్‌మేట్స్ (Bigg Boss Telugu 3) గోల మినహాయిస్తే, ఎక్కడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లేకపోవడం గమనార్హం.
Click Here: ఎలిమినేషన్ 4: బిగ్ షాక్ తప్పదా?
ఇక, అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోవడంతో శివజ్యోతి (Siva Jyothy) రొటీన్‌గానే ఏడ్చేసింది. ఇది ఆమె ప్రతిసారీ చేస్తున్నదే. కాగా, అషు రెడ్డి ఎలిమినేట్ అవుతుందని, నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమయిన రోజే (అంటే, సోమవారం నాడే) చాలామంది సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. అదే జరిగింది.
చివర్లో అషు – హిమజ (Himaja) మిగిలారు నామినేషన్స్‌కి. అయినా, అషు రెడ్డిలో (Ashu Reddy Eliminated) ఎలాంటి టెన్షన్ లేదు. హిమజ సంగతి సరే సరి. అయితే, ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ వుంటుందనే ప్రచారం జరిగింది. కానీ, అలాంటి ఆసక్తికరమైన పరిణామాలేమీ చోటు చేసుకోలేదు.
Click Here: బిగ్ స్కెచ్.. శ్రీముఖి గ్లామర్ బీభత్సం.!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖచ్చితంగా వుంటుందనీ, అది అతి త్వరలోనే జరుగుతుందనీ తెలుస్తోంది. ఏదిఏమైనా, మరో డల్ వీక్, అంతకు మించిన డల్ వీకెండ్ ఈ వారం బిగ్‌హౌస్‌లో చూడాల్సి వచ్చిందన్నది మెజార్టీ బిగ్‌బాస్ వ్యూయర్స్ అభిప్రాయం.