మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పుట్టినరోజు కానుకగా అభిమానుల కోసం ‘ఆచార్య’ (Mega Star Chiranjeevi Acharya) సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతుండగా, నిన్నటివరకూ టైటిల్‌ని సస్పెన్స్‌గానే వుంచారు.
అయితే, కొన్నాళ్ళ క్రితం ఓ సందర్భంలో ‘ఆచార్య’ టైటిల్‌ని స్వయంగా చిరంజీవి అనౌన్స్ చేసేశారనుకోండి.. అది వేరే సంగతి. ఇక, ‘ఆచార్య’ టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ అలాగే మోషన పోస్టర్‌ని విడుదల చేసింది ‘ఆచార్య’ యూనిట్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చిరంజీవి సరసన తొలుత త్రిషను (Trisha Krishnan) హీరోయిన్‌గా ఈ సినిమా కోసం ఎంపిక చేసినా, కొన్ని అనివార్య కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. త్రిష ప్లేస్‌లో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) పేరుని ఖరారు చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌కి కాస్త ‘బ్రేక్’ వచ్చిన విషయం విదితమే.
అన్నీ కుదిరితే, సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్‌లో తిరిగి ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా, ‘కామ్రేడ్’ అంటూ ఈ సినిమాలో హీరో పాత్రని ప్రమోట్ చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇంతకీ, మెగా కామ్రేడ్ పోరు ఎవరి మీద.? ‘ధర్మస్థలి’ పేరుతో ఓ నిర్మాణం మోషన్ పోస్టర్‌లో కన్పిస్తుండడంతో, ఈ ‘ధర్మస్థలి’కి ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత వుందో అర్థం చేసుకోవచ్చు.
కొరటాల శివ సినిమాలంటే, కమర్షియల్ అంశాలతోపాటు మంచి సోషల్ మెసేజ్ కూడా వుంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఎలాంటి మెసేజ్ సొసైటీకి కొరటాల శివ ఇవ్వబోతున్నాడోగానీ, ఇప్పటిదాకా కెరీర్‌లో అపజయమంటూ ఎరుగని కొరటాల శివ.. రీ-ఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల వసూళ్ళు సాధించిన మెగాస్టార్.. వెరసి ‘ఆచార్య’పై అంచనాలు ఆకాశాన్నంటేశాయి.
2021 సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ఆచార్య’ కరోనా కారణంగా 2021 సమ్మర్‌కి వాయిదా పడింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం విదితమే.