అలేఖ్య హారిక, మెహబూబ్ దిల్‌సే.. ఇద్దరూ యూ ట్యూబ్ సెన్సేషన్స్. షార్ట్ ఫిలింస్‌తో దుమ్మురేపేశారు. అలా వీరికి సోషల్ మీడియాలో బోల్డంత ఫాలోయింగ్ వుంది. అదే ఈ ఇద్దర్నీ (Alekhya Harika Vs Mehaboob Dilse) బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా మారింది. హౌస్‌లో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఎలా వుంది.? అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి.
కానీ, ఆ మధ్య ఓ టాస్క్ సందర్భంలో మెహబూబ్, హారిక కలిసి స్టేజ్ మీద దుమ్మురేపేశారు తమదైన డాన్స్ మూమెంట్స్‌తో. కానీ, క్రమంగా ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోయింది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నామినేషన్స్ సమయంలోనూ అంతే.
హారికను నామినేట్ చేయాలని మెహబూబ్ ఈ వారం కూడా ఫిక్సయిపోయాడు. మరోపక్క, హారిక తక్కువేం తిన్లేదు.. మెహబూబ్‌ని నామినేట్ చేసి పడేసింది. అయితే, ఈ క్రమంలో ఆమె ఇచ్చిన రీజన్ చాలామంది బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి నచ్చడంలేదు.
అఫ్‌కోర్స్, హౌస్‌లో నిజంగా ఏం జరుగుతోందో చూసేవాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే, బిగ్‌బాస్.. టీఆర్పీ లెక్కలు వేసుకుని, అవసరమైన కంటెంట్ మాత్రమే చూపిస్తాడు గనుక. సో, మనకి కనిపించినదాన్ని బట్టి ఇటు మెహబూబ్‌నిగానీ, అటు హారికనిగానీ జడ్జ్ చేసేయలేం.
అయితే, ఇదొక గేమ్ షో. అల్టిమేట్‌గా ఈ వారం నామినేషన్స్‌లో మెహబూబ్‌తోపాటు, హారిక కూడా వుంది. ఈ ఇద్దరిలోంచి ఎవరైనా (Alekhya Harika Vs Mehaboob Dilse) ఎలిమినేట్ అయ్యే అవకాశం వుందా.? లేదంటే, ఇద్దరూ సేవ్ అయిపోతారా.? అన్నది వేచి చూడాల్సిందే. ఈలోగా ఇరువురి సపోర్టర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఫైట్ షురూ చేసేశారు.
ఇక, ఈవారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్ అయిన సభ్యుల్లో స్వాతి దీక్షిత్, అబిజిత్, లాస్య, సోహెల్, మెహబూబ్, హారిక, కుమార్ సాయి వున్నారు.