క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ‘రుద్రమదేవి’ తర్వాత మరో సినిమా ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నాడు. ‘హిరణ్యకశ్యప’ సినిమా తెరకెక్కించాల్సి వున్నా, కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టుని కాస్త పక్కన పెట్టి, ‘శాకుంతలం’ (Shaakuntalam Heroine) అనే కొత్త సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు.
దాంతో, ఈ ‘శాకుంతలం’లో నటించబోయేది ఎవరు.? అన్న సస్పెన్స్ ఇటు సినీ పరిశ్రమలోనూ, అటు ఆడియన్స్‌లోనూ కనిపిస్తోంది. ఈ సినిమా కోసం పూజా హెగ్దే పేరుని పరిశీలిస్తున్నారంటూ ఓ గాసిప్ వినిపించింది. అంతలోనే, శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది.
తాజాగా జాన్వీ కపూర్ పేరు ప్రచారంలోకి రావడం గమనార్హం. ‘శాకుంతలం’ సినిమా కేవలం తెలుగు వెర్షన్‌కే పరిమితయ్యే అవకాశాల్లేవు. దీన్ని హిందీతోపాటు, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు అవకాశాలున్నాయి. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది కదా.!
గాసిప్స్ సంగతెలా వున్నా, పూజా హెగ్దేని గనుక గుణశేఖర్ కన్సిడర్ చేస్తే, ‘శాకుంతలం’ సినిమా రేంజ్ ఇంకో లెవల్‌కి వెళుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. జాన్వీ కపూర్‌ని ఖరారు చేసినా.. ‘శాకుంతలం’ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చిపడుతుంది. శృతిహాసన్ విషయంలోనే కొంత స్తబ్దత కనిపిస్తోంది.
ఎందుకంటే, శృతిహాసన్ కెరీర్ ఇప్పుడు ఏమంత గొప్పగా లేదు. అన్నట్టు, అనుష్క పేరు ఈ ముగ్గురికంటే టాప్ పొజిషన్‌లో వుండడం గమనార్హం. ‘రుద్రమదేవి’ సినిమాని అనుష్కతోనే గుణశేఖర్ చేసిన విషయం విదితమే. అనుష్క గనుక ‘శాకుతలం’లో నటిస్తే.. ఆ రేంజ్ ఇంకోలా వుంటుంది.
కానీ, అనుష్క కంటే యంగ్ హీరోయిన్స్ అయితేనే ఈ ‘శాకుంతలం’ కథకి న్యాయం జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. అసలు కథేంటో తెలియదు.. జస్ట్, దర్శకుడు గుణశేఖర్ ‘టైటిల్’ని ప్రకటించాడంతే. ఈలోగా ఇన్ని గాసిప్స్.!
ఒక్కటి మాత్రం నిజం, టైటిల్‌తోనే గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ‘హిరణ్యకశ్యప’ని కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా పక్కన పెట్టి, ‘శాకుంతలం’ సినిమాని గుణశేఖర్ చేయనున్నాడంటే, ఇది అత్యంత వేగంగా పూర్తయ్యే ప్రాజెక్ట్ అనే అర్థం చేసుకోవాలి.
సో, ఈ సినిమాకి సంబంధించి పూర్తి డిటెయిల్స్ అతి త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయన్నమాట.