Table of Contents
Heroines Fight Against Cancer.. ఔను, వాళ్ళు క్యాన్సర్‌ని జయించారు.! ఒకప్పుడు క్యాన్సర్ అంటే, నయం చేయడానికి వీల్లేని రోగం. కానీ, ఇప్పుడలా కాదు.!
క్యాన్సర్ సోకిందంటే, మరణం తప్పదన్న రోజుల నుంచి, క్యాన్సర్‌ని జయించొచ్చు.. అనేదాకా పరిస్థితులు మారాయి. అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రావడమే కారణం.
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అందాల భామల్లో కొందరు క్యాన్సర్ బారిన పడినవారూ వున్నారు. అలా క్యాన్సర్ బారిన పడి, కోలుకున్నవారూ లేకపోలేదు.
Heroines Fight Against Cancer.. క్యాన్సర్ విజేతలు పెరుగుతున్నారు..
నటి గౌతమి తెలుసు కదా.? ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు చాలాకాలం. క్యాన్సర్ నుంచి కోలుకుని, సాధారణ జీవితం గడుపుతున్నారామె. ఈ మధ్య పలు తెలుగు సినిమాల్లో కనిపించారు గౌతమి.
క్యాన్సర్‌ని జయించాలంటే, కేవలం మందులు సరిపోవు.. మానసిక స్థైర్యం అవసరం.. అని గౌతమి చెబుతుంటారు.
ఇక, బాలీవుడ్ నటి సోనాలి బింద్రే, తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితురాలే. అత్యంత ప్రమాదకరమైన ‘రకం’ క్యాన్సర్ బారిన పడింది సోనాలి బింద్రే.

క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో సహచర నటుడు సల్మాన్ ఖాన్, తనకు ఇచ్చిన ధైర్యం చాలా ప్రత్యేకమని ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే చెప్పింది.
మరణం తప్పదని, ఓ దశలో ఆమె కూడా ఫిక్సయిపోయిందట. కానీ, ధైర్యంగా పోరాడింది. క్యాన్సర్‌పై విజయం సాధించింది సోనాలి బింద్రే. క్యాన్సర్‌ని ఎలా జయించొచ్చో చెబుతుంటుందామె ఇప్పుడు.
మమతా మోహన్ దాస్ కథ వేరు..
నటి, సింగర్ మమతా మోహన్ దాస్ కూడా అంతే. క్యాన్సర్ బారిన పడింది. ఓ సారి కాదు, రెండు మూడు సార్లు ఆమెను క్యాన్సర్ ఇబ్బంది పెట్టిందట.
కానీ, క్యాన్సర్‌ని జయించే క్రమంలో శక్తినంతా కూడదీసుకున్నానని తన ‘క్యాన్సర్ పోరాటం’ గురించి పలు సందర్భాల్లో చెప్పింది మమతా మోహన్ దాస్.

ఓ తెలుగు సినిమా షూటింగ్ సమయంలోనూ మమత క్యాన్సర్‌తో బాధపడింది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు మమతా మోహన్ దాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూశాం.
ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, అప్పట్లో మమతా మోహన్ దాస్‌కి అందించిన సహకారం అంతా ఇంతా కాదు.
మిర్చి బ్యూటీ హంసా నందిని కూడా..
‘మిర్చి’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన హంసా నందిని తెలుసు కదా.? ఆమె కూడా ఒకప్పుడు క్యాన్సర్ బాధితురాలే. ఇప్పుడామె పూర్తిగా కోలుకుంది. తిరిగి సినిమాల్లో నటిస్తోంది కూడా.
క్యాన్సర్ సోకితే, కీమో థెరపీ నేపథ్యంలో జుట్టుని కోల్పోవాల్సి వస్తుంది. శరీరంలోనూ అనేక మార్పులొస్తాయ్. అయితే, క్యాన్సర్ చికిత్స తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ కాలక్రమంలో గణనీయంగా తగ్గాయి.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
అదే సమయంలో, ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న అందాల భామలు, క్యాన్సర్ వల్ల కోల్పోయిన గ్లామర్‌ని తిరిగి పొందగలుగుతున్నారు. అది, ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
అందుకే, క్యాన్సర్‌ని జయించిన హీరోయిన్లని ‘లేడీ సూపర్ స్టార్స్’ అనడంలో తప్పేముంది.? వీళ్ళు రియల్ సూపర్ స్టార్స్.!
హీరోయిన్లే కాదు, క్యాన్సర్ మహమ్మారిని జయించిన హీరోలూ లేకపోలేదు. ఆ హీరోల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం.