మిస్టర్ క్లీన్.. మిస్టర్ కూల్.. మిస్టర్ జెన్యూన్.. ఇలా నోయెల్ సీన్ గురించి చాలానే వున్నాయ్ అభిప్రాయాలు బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో. కానీ, ఒకే ఒక్క మాట.. దాంతో మొత్తం సీన్ రివర్స్ (Noel Sean Akhil Sarthak BB4 Telugu) అయిపోయింది.
‘ఒక్కసారైనా నిజాయితీగా వుండు..’ అంటూ బిగ్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్ కుమార్ సాయి మీద గుస్సా అయ్యాడు నోయెల్. ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ చిన్న విషయమ్మీద ‘నిజాయితీ’ వంటి పెద్ద పెద్ద మాటల జోలికి నోయెల్ వెళ్ళడం చాలా పెద్ద తప్పుగానే చెప్పుకోవాలి.
ఆ సమయంలో అంత పెద్ద మాట నోయెల్ ఉపయోగించకుండా వుంటే మంచిది. కానీ, వాడేశాడు.. దాంతో నోయెల్ మీద వున్న అభిమానం పోయిందంటూ చాలామంది బిగ్‌బాస్ (Bigg Boss Telugu 4) వ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారు.
అక్కడ కుమార్ సాయి తప్పే చేసి వుండొచ్చు.. కానీ, ఓ ‘ఆట’ ఆడేందుకు బిగ్ హౌస్‌లోకి (Bigg Boss 4 Telugu) వచ్చిన ఆటగాళ్ళ మధ్య ‘నిజాయితీ’ గురించిన పెద్ద మాటలెందుకు.? అన్నదే ఇక్కడ చర్చ.
ఇంకోపక్క, అఖిల్ సార్థక్ (Akhil Sarthak) కూడా ‘సిల్లీ వేషాలు’ వేశాడు.. అదీ సోహెల్ (Syed Sohel Ryan) మీద. మెహబూబ్‌తో (Mehaboob Dilse) అఖిల్‌కి చిన్న విషయమ్మీద చిన్న ‘గ్యాప్’ వచ్చింది. ఆ విషయమై సోహెల్‌తో అఖిల్ మాట్లాడుతూ గొడవ పెట్టుకున్నాడు. సరే, ఇవన్నీ మామూలే.
కానీ, ‘మీరెవరు.?’ అని ఫ్రెండ్ లాంటి సోహెల్ మీద అఖిల్ విరుచుకుపడ్డమే కాదు, ‘అలకపాన్పు’ ఎక్కేశాడు. అసలే సోహెల్‌కి టెంపర్‌మెంట్ ఎక్కువ. కాస్సేపు గుస్సా అయ్యాడు. కానీ, తన సహజమైన శౖలిలో మాత్రం విరుచుకుపడలేదు.
అఖిల్‌కి మెహబూబ్ సారీ చెప్పినా, అఖిల్ ఆలోచనల్లో మార్పు లేదు. ఈ ఎపిసోడ్ అంతా చాలా ఫేక్‌గా అనిపించింది. అఖిల్ కూడా వున్నపళంగా ఒక్క ఎపిసోడ్‌తోనే పూర్తిగా ఇమేజ్ చెడగొట్టేసుకున్నాడు.
అటు నోయెల్ సీన్ (Noel Sean), ఇటు అఖిల్ సార్థక్.. ఒకే రోజు చిన్న చిన్న విషయాలకి ‘సిల్లీగా’ బుక్కయిపోయారు.. బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో పలచనైపోయారు. ఈ ఇద్దరూ ఈ వారం ఎలిమినేషన్ కోసం రేసులో వున్నారన్న సంగతి తెల్సిందే.