‘మోనాల్ సాయంతో, అబిజీత్ కోసం కెప్టెన్సీ గెలిచావ్..’ అనే ఒక్క మాటతో హారికని, అబిజీత్‌కి దూరం చేసేశారు బిగ్‌హౌస్‌లో. స్క్రిప్ట్ ఆ రేంజ్‌లో డిసైడ్ అయ్యింది మరి. ఆ తర్వాతి నుంచీ ‘కథ’ మారిపోయింది హౌస్‌లో. ఇప్పుడిక అరియానా (Ariyana Deserves BB4 Title) వంతు.
‘నువ్వెందుకు విమెన్ కార్డు వాడావ్.?’ అని అరియానాని హోస్ట్ నాగార్జున ప్రశ్నించేశాడు. అరియానా ఏడ్చింది.. ఓ మగాడు నీ మీదకు దూసుకొస్తుంటే నేనేం చేయగలను.? అని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన మాట వాస్తవం. దాన్ని టెలికాస్ట్ చేయకుండా వుండాల్సింది.. విమెన్ కార్డ్ అన్న అంశమే చర్చకు వస్తుందనుకుంటే. కానీ, అలా చేయలేదు బిగ్‌బాస్.
ఆ విమెన్ కార్డు చుట్టూ వీకెండ్ ఎపిసోడ్ నడిపించాలని ముందే డిసైడ్ అయ్యారో ఏమో, దాన్ని అలాగే టెలికాస్ట్ చేసి.. దాని చుట్టూ నాగ్‌తో నాలుగు మాటలు మాట్లాడించి, అరియానా ఎనర్జీని తగ్గించేయాలన్న ప్లాన్ పక్కాగా అమలు చేశారన్నమాట.
నిజానికి, అరియానా – సోహెల్ మధ్య గొడవకు సంబంధించి, సోహెల్‌పై నాగార్జున విరుచుకుపడిపోవాలి. గతంలో ఇలాంటి సందర్భం ఒకటి వచ్చింది కూడా. ‘అమ్మాయి మీద అరుస్తావా.?’ అంటూ అప్పట్లో కొరడా ఝుళిపించిన నాగ్, ఈసారి మాత్రం.. చిత్ర విచిత్రంగా వ్యవహరించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. అరియానా – సోహెల్.. ఇద్దరూ అరచుకుంటేనే గొడవ జరిగింది. సోహెల్ విషయంలో సున్నితంగా వ్యవహరించి, అరియానాని నాగార్జున నిలదీసిన తీరుని, అరియానా (Ariyana Deserves BB4 Title) అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫైనల్‌గా ఇదొక గేమ్ షో మాత్రమే.
ఎవర్ని ఎప్పుడు ఎలా టార్గెట్ చేస్తే, తమ షోకి రేటింగ్ పెరుగుతుందన్న విషయాన్ని మాత్రమే బిగ్‌బాస్ టీమ్ ఆలోచిస్తుంటుంది.. ఆ కోణంలోనే నాగార్జునతో మాట్లాడిస్తారు కూడా.
ఎలాగైతేనేం, సోహెల్ – అరియానా మధ్య గొడవ చల్లారింది. చల్లారినట్టేనా.? సోహెల్‌కి మళ్ళీ మెడ నరాలు ఉప్పొంగిపోతాయా.? ఈసారి సోహెల్ ఏం చేసినా, నాగ్ నుంచి హెచ్చరికలేమీ రాకపోవచ్చు. ఎందుకంటే, నాగ్ ఇప్పుడు సోహెల్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడన్నది అరియానా అభిమానుల ఆవేదన.