ఓ కంటెస్టెంట్‌ని చూసి, బిగ్‌బాస్ గర్వపడటమేంటి.? ఆ మాట బిగ్‌బాస్ నోట వచ్చిందంటే, ఆ కంటెస్టెంట్ ఈ సీజన్‌కి విన్నర్ అనే అర్థం. ఓట్లు, ఫినాలె.. ఇవన్నీ అనవసరం. బిగ్‌బాస్ అధికారికంగా విన్నర్‌ని అప్రకటించేశాడన్నమాట.! ఆ కంటెస్టెంట్ ఇంకెవరో కాదు అబిజీత్ (Abijeet King Of Hearts BB4 Telugu).
నిజానికి, సీజన్ ప్రారంభమయినప్పటినుంచీ బిగ్‌హౌస్‌లో అబిజీత్ (Abijeet Duddala) సమ్‌థింగ్ స్పెషల్ అంతే. ఎవరితోనూ కలవడు.. డాన్సులు చెయ్యడు.. టాస్క్‌లలో బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడు.. ఇలా చాలా విమర్శలు అబిజీత్ మీద తోటి కంటెస్టెంట్స్ నుంచి వచ్చాయి.
కానీ, బిగ్‌బాస్‌కి అన్నీ తెలుసు. ‘అబిజీత్.. మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాం..’ అని బిగ్‌బాస్ స్వయంగా చెప్పాడు. సో, మేటర్ క్లియర్. హౌస్‌లో ఎమోషన్స్‌ని అబిజీత్ కంట్రోల్ చేసుకున్న వైనం.. తోటి కంటెస్టెంట్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించడం.. వారికి అవసరమైనప్పుడు భరోసా ఇవ్వడం.. ఇలా అబిజీత్‌లోని చాలా గుడ్ క్వాలిటీస్ గురించి తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ చెప్పాడు.

ఓ దశలో అబిజీత్, ఇవన్నీ వింటూ చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాడు. ‘నా పట్ల బిగ్‌బాస్‌కి (Bigg Boss 4 Telugu) ఇంత గొప్ప గౌరవం వుందా.?’ అని అబిజీత్ ఆశ్చర్యపోయాడు.
‘ఆ గౌరవం నాకు దక్కడం చాలా ఆనందంగా వుంది.. ఇక్కడ నేను వున్నందుకు, నేను గర్వపడుతున్నాను.. బిగ్‌బాస్‌కి రావడం నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్స్‌లో ఒకటి..’ అంటూ అబిజీత్ భావోద్వేగానికి లోనయ్యాడు.
బయట ఏం జరిగిందీ, తోటి కంటెస్టెంట్స్‌కి చెబుతూ.. వారికీ కొన్ని సలహాలిచ్చాడు. ‘బయటకు వెళ్ళాక.. మీరొక్కరే హౌస్‌లో వున్నట్లు ఫీలవ్వండి.. అక్కడ మాట్లాడే ప్రతి మాటనీ ఎంజాయ్ చేయండి..’ అంటూ అబిజీత్ సూచించాడు.
మోనాల్ గజ్జర్ (Monal Gajjar), అఖిల్ సార్థక్ (Akhil Sarthak).. ఇలా కొందరు అబిజీత్‌ని పనిగట్టుకుని టార్గెట్ చేసినా.. అబిజీత్ ఏంటనేది బిగ్‌బాస్ వీక్షకులకు బాగా అర్థమయ్యింది. అబిజీత్‌ని (Abijeet King Of Hearts BB4 Telugu) అంతకన్నా బాగా అర్థం చేసుకున్నాడు బిగ్‌బాస్. మిగతా కంటెస్టెంట్స్‌కీ బిగ్‌బాస్ నుంచి పొగడ్తలు బాగానే వచ్చినా, అబిజీత్ సమ్‌థింగ్ స్పెషల్.
ఎందుకంటే, ప్రతి క్షణాన్నీ బిగ్‌హౌస్‌లో (Bigg Boss Telugu 4) అబిజీత్ ఎంజాయ్ చేశాడు. ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టినా ఉపయోగం లేదనుకున్న చోట, మైండ్ గేమ్ ఆడాడు. తాను గెలిచాడు, తన తోటి కంటెస్టెంట్స్‌ని (గ్రూప్ పరంగా) గెలిపించాడు. ఓవరాల్‌గా అబిజీత్, ఇప్పటికే బిగ్‌బాస్ విన్నర్ అనిపించేసుకున్నాడు.
ఓట్లు పోటెత్తుతున్నాయి. ఇతర కంటెస్టెంట్స్ ఎవరూ అబిజీత్‌కి (Abijeet King Of Hearts BB4 Telugu) దరిదాపుల్లో కూడా లేరు. అందుకేనేమో, బిగ్‌బాస్.. సింపుల్‌గా ‘నిన్ను చూసి గర్వపడుతున్నాం.?’ అనేశాడు. ఇంతకంటే ఏ కంటెస్టెంట్‌కి అయినా విక్టరీ ఇంకేముంటుంది.?