యంగ్ హీరో నాగ శౌర్య (Naga Shaurya Fixes The Target) పేరు చెప్పగానే మనకి మన పక్కింటి కుర్రాడు గుర్తుకొస్తాడు. కాదు కాదు, మనింట్లోని కుర్రాడే గుర్తుకొస్తాడు. ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి స్మూత్ లవ్ స్టోరీ చేసినా, ‘అశ్వద్ధామ’ అంటూ సూపర్ మాస్ సినిమా చేసినా.. నాగ శౌర్య లెక్కే వేరు. ఇప్పుడు ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
నాగ శౌర్య పుట్టినరోజు (Happy Birthday Naga Sharuya) నేడు. ఈ నేపథ్యంలో నాగ శౌర్య నుంచి రెండు ప్రోమోస్ బయటకొచ్చాయి. ఒకటి నాగ శౌర్య క్లాస్ లుక్‌తో కనిపిస్తోన్న ‘వరుడు కావలెను’ (Varudu Kavalenu) సినిమా ప్రోమో కాగా, ఇంకొకటి సూపర్ మాస్ రోల్‌లో కనిపించనున్న ‘లక్ష్య’ (Lakshya) సినిమాకి సంబంధించిన ప్రోమో.
ఈ రెండిటిలోనూ కామన్ పాయింట్ ఏంటో తెలుసా.? సిక్స్ ప్యాక్. షర్ట్ లెస్‌గా నాగ శౌర్య (Naga Shaurya) రెండు ప్రోమోస్‌లోనూ కాస్సేపు కనిపించాడు. అయితే, ఒకటి చాలా క్లాస్‌గా కనిపిస్తోంది.. ఇంకోటి మాత్రం.. మాస్, ఊరమాస్.. అనేలా వుంది.
‘వరుడు కావలెను’ సినిమా కోసం నాగ శౌర్య, తెలుగమ్మాయ్ రీతూ వర్మతో (Ritu Varma) జత కడుతుండగా, ‘లక్ష్య’ సినిమాలో కేతిక శర్మతో (Ketika Sharma) ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నాడీ యంగ్ హీరో. విడుదలవుతూనే అటు ‘వరుడు కావలెను’ గ్లింప్స్, ‘లక్ష్య’ టీజర్.. రెండూ సెన్సేషనల్ అయ్యాయి.
వీటిల్లో ‘లక్ష్య’ (Lakshya Teaser) ఇంకాస్త బాగా ఆకట్టుకుంటోందంటే, దానికి కారణం, సూపర్ పవర్.. అన్నట్టుగా నాగ శౌర్య కనిపిస్తుండడమే. జగపతిబాబు వాయిస్ ఓవర్ ‘లక్ష్య’ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓ ఆర్చర్ (విలు విద్యలో ఆరి తేరినవాడు), కొన్ని కారణాలతో ఆర్చరీకి దూరంగా ఎందుకు వుండాల్సి వచ్చింది.? అన్నది ఈ సినిమా కథ.. అని ప్రోమోని చూస్తే అర్థమవుతోంది.
‘వరుడు కావలెను’ (Varudu Kavalenu Teaser) సినిమా విషయానికొస్తే, బాబు బాగా రిచ్.. అన్నట్టు బిల్డప్ కన్పిస్తోంది. దేనికదే.. భళా అన్పించుకుంటున్న ఈ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద ఎంత విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే సినిమాలు విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.