Priyanka Chopra ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరిది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఆమె కీర్తి ప్రతిష్టలు పెరిగాయ్. తనకంటే వయసులో చాలా చిన్నవాడ్ని పెళ్ళి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది ప్రియాంక చోప్రా.
ప్రియాంక చోప్రా వైవాహిక జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటేనని ఆ మధ్య ప్రచారం జరిగింది. భర్తతో ప్రియాంక విడాకులు తీసుకోనుందంటూ గాసిప్పులు పుట్టుకొచ్చాయ్. ఇంతలోనే పెద్ద షాకింగ్ అప్‌డేట్. ప్రియాంక చోప్రా తల్లయ్యిందని. అదెలా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. రాత్రికి రాత్రి ప్రియాంక చోప్రా తల్లయ్యింది మరి.!
Priyanka Chopra.. అప్పుడలా, ఇప్పుడిలా.!
‘పిల్లలెప్పుడు.?’ అని ఆ మధ్య ఎవరో ప్రశ్నిస్తే, ‘దైవాధీనం’ అనేసింది ప్రియాంక చోప్రా. ఆ దైవమే ఇప్పుడు ప్రియాంక చోప్రా తల్లయ్యేలా చేసిందా.? అంటే, ఔననే అనుకోవాలేమో.

కాదు కాదు, అసలు విషయమేంటంటే ప్రియాంక చోప్రా నిజంగానే తల్లయ్యింది.. అదీ సరోగసీ మార్గంలో. సో, ప్రియాంక.. ఆమె భర్త నిక్ జోనాస్ ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారన్నమాట.
తాము తల్లిదండ్రులమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ (Priyanka Chopra Jonas) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఆనంద క్షణాల్లో తమ ప్రైవసీని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది ‘ప్రియానిక్’ జంట.
సరోగసీ అప్పుడు వింత.. ఇప్పుడు సర్వసాధారణం.!
సరోగసీ ఒకప్పుడు వింత.. కానీ, ఇప్పుడు అది సర్వసాధారణం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎంతోమంది సెలబ్రిటీలు సరోగసీ ద్వారా రాత్రికి రాత్రి తల్లిదండ్రులైపోయారు. చాలా సినిమాలు సరోగసీ నేపథ్యంలో వచ్చాయి, వస్తూనే వున్నాయి కూడా.
Also Read: ఆర్థిక స్వాతంత్ర్యంపై సమంత చెప్పిన పాఠమిదీ.!
కొన్ని ప్రత్యేక పరిస్థితుల నడుమ, సాధారణ పద్ధతుల్లో తల్లిదండ్రులయ్యే అవకాశం లేనప్పుడు, అలాంటివారికి సరోగసీ ఓ వరం. అదే సమయంలో, ఆర్థికంగా చాలా ఉన్నత స్థానంలో వున్నోళ్ళు.. సాధారణ గర్భంతో వచ్చే సమస్యల్ని తప్పించుకునేందుకు సరోగసీని ఆశ్రయిస్తారన్న విమర్శ కూడా వుందనుకోండి.. అది వేరే సంగతి.