పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభార్ (Prabhas Salaar Item Song) హీరోగా ‘కెజిఎఫ్’ (KGF) ఫేం ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సలార్’ (Salaar) సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం ‘కెజిఎఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2) సినిమా పనుల్లో బిజీగా వున్న ప్రశాంత్ నీల్, ఆ సినిమా పూర్తవగానే ‘సలార్’ (Salaar Movie) సినిమా షూటింగ్ షురూ చేస్తాడు.
ఇక, ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమా పనుల్లో చాలా చాలా బిజీగా వున్నాడు. ఇంకోపక్క ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమయ్యింది. మరోపక్క ప్రభాస్ – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కూడా రేపో మాపో సెట్స్ మీదకు వెళ్ళనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, ‘సలార్’ సినిమాకి సంబంధించి కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వచ్చిపడుతున్నాయి. దటీజ్ ప్రభాస్ (Rebel Star Prabhas). ప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరు.? ఒకరా.? ఇద్దరా.? ఇంకా ఎక్కువమందే వుండబోతున్నారా.? శృతిహాసన్ (Shruti Haasan) పేరు ఇప్పటికే ఖరారైన దరిమిలా, ఆమె పాత్ర ఎలా వుంటుంది.? విలన్ల సంగతేంటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.
తాజాగా మరికొన్ని హాట్ గాసిప్స్ సినిమా చుట్టూ వినిపిస్తున్నాయి. ప్రభాస్‌తో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన బ్యూటిఫుల్ లేడీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఓ స్పెషల్ సాంగ్ కోసం ఆడి పాడనుందనేది ఓ గాసిప్. అదే సమయంలో, దీపికా పడుకొనే (Deepika Padukone) పేరు కూడా విన్పిస్తోంది ‘సలార్’ – ‘స్పెషల్ ఐటమ్’ (Salaar Special Song) కేటగిరీ కింద.
దీపికా పడుకొనే ఎటూ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో సినిమాకి హీరోయిన్ గనుక.. పనిలో పనిగా ఆమెతో స్పెషల్ సాంగ్ కూడా ప్రభాస్ (Prabhas Salaar Item Song) చేయించేస్తాడని అంటున్నారు. ఇటు ప్రియాంక చోప్రా అయినా, అటు దీపిక పడుకొనె అయినా.. స్పెషల్ సాంగ్ (Item Bomb Of Salaar) అంటే మాటలు కాదు. కోట్లు సమర్పించుకోవాల్సిందే.
అయితే, ‘సాహో’ (Saaho) సినిమా కోసం జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ని (Jacqueline Fernandez) దింపినప్పుడు ‘సలార్’ కోసం ప్రియాంక లేదా దీపికలలో ఎవరో ఒకరు దించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అన్నట్టు, ప్రశాంత్ నీల్, ‘కెజిఎఫ్ ఛాప్టర్ 1’ కోసం మౌనీ రాయ్ (Mouni Roy), తమన్నా భాటియాలను (Tamannah Bhatia) దించిన విషయం విదితమే.
సో, ప్రియాంక – దీపిక.. ఈ ఇద్దరూ ‘సలార్’లో స్పెషల్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్స్ (Special Song In Salaar) చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా.. అంటున్నారు ప్రభాస్ అభిమానులు. అవును మరి, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Pan India Super Star Prbhas) సినిమా అంటే, దానికి ఓ రేంజ్ వుండి తీరాల్సిందే.