హీరోయిన్ భర్త చనిపోతాడు.. ఆమె వెంట పడ్తాడు హీరో. ఇదీ ‘చావు కబురు చల్లగా’ (Chaavu Kaburu Challaga Shockingly Hot) సినిమా స్టోరీ లైన్. అదేంటీ, సినిమా రిలీజ్ కాకుండానే మొత్తం స్టోరీ చెప్పేస్తే ఎలా.? ఇది ట్రైలర్ చూస్తే అర్థమయ్యే విషయం.. కొత్తగా అనాలసిస్ చేయాల్సిందేమీ లేదు.
యంగ్ హీరో కార్తికేయ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న సినిమా ఇది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే అనిపిస్తోందిగానీ, బ్యాక్‌డ్రాప్ మాత్రం కొత్తగా వుంది. మన హీరో అంత్యక్రియల కోసం ఉపయోగించే వ్యాన్‌ని నడుపుతుంటాడు. హీరోయిన్ ఓ ఆసుపత్రిలో పనిచేస్తుంటుంది.
‘నా జోలికొస్తే మా ఆయన సమాధి పక్కనే.. నిన్నూ పాతిపెడతా..’ అని హీరోతో హీరోయిన్ చెప్పే డైలాగ్.. భాగా ఎక్కేస్తోంది చాలామందికి. కమర్షియల్ హంగులు.. అనే మాటకి స్థాయి పెరిగిందో, తగ్గిందో అర్థం కాని డైలమా ఏర్పడింది ఈ డైలాగ్ విన్న తర్వాత చాలామందికి.
ఇలాంటి డైలాగులు సినిమాలో చాలానే వున్నట్టున్నాయి. ట్రైలర్‌లో వినిపించిన డైలాగుల్లో చాలావరకు.. విన్నోళ్ళకు షాకులిచ్చేవే. లావణ్య త్రిపాఠి (Chaavu Kaburu Challaga Shockingly Hot) మంచి నటి. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో నటిగా ఇంకో మెట్టు పైకెక్కేలానే వుంది.
హీరో కార్తికేయ కూడా చాలా ఈజ్‌తో కనిపిస్తున్నాడు. సీనియర్ నటి ఆమని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. మొత్తమ్మీద ట్రైలర్ అయితే బాగానే వ్యూస్ సంపాదిస్తోంది.. సినిమాపైనా అంచనాలు పెంచేస్తోంది.
‘అసలు ఇదేం కాన్సెప్ట్.?’ అని కొందరు ముక్కున వేలేసుకుంటోంటే, ఇంకొందరి మనోభావాలూ దెబ్బతినేస్తున్నాయట. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. అన్నట్టుగా సమ్‌థింగ్ కొత్తగా (Chaavu Kaburu Challaga Shockingly Hot) ట్రై చేసింది సినిమా యూనిట్.
‘చావు కబురు చల్లగా’ అని టైటిల్ పెట్టారుగానీ, కాస్త ‘ఘాటుగానే’ అన్పిస్తోంది డైలాగుల డోసు. కార్తికేయ ఈ సినిమాతో హిట్టు కొట్టేలానే వున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం విదితమే.