Kadambari Jethwani YSRCP.. సినీ నటి కాదంబరి వ్యవహారం, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.
వైసీపీ హయాంలో కొందరు వైసీపీ నేతలు, కొందరు పోలీస్ ఉన్నతాధికారులు తనను వేధించారన్నది సినీనటి కాదంబరి ఆరోపణ.
తాజాగా ఆమె, ఈ విషయమై ఏపీలో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నారు. ఫిర్యాదులో కాదంబరి ఎవరెవరి పేర్లను ప్రస్తావించబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది.
Kadambari Jethwani YSRCP.. వైసీపీలో పెద్ద తలకాయలు..
వైసీపీకి చెందిన ఓ పెద్ద తలకాయ్.. కాదు కాదు, కొన్ని పెద్ద తలకాయలకు షాక్ ఇచ్చేలా కాదంబరి వ్యవహారం మలుపు తిరగబోతోందిట.
ఇప్పటికే ఆయా వైసీపీ నేతలు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో, సినీ నటి కాదంబరి మీద లేనిపోనివి కల్పిస్తూ దుష్ప్రచారానికి తెరలేపింది వైసీపీ అను‘కుల’ మీడియా.!
Also Read: Ruhani Sharma’s Strong Statement About AGRA
అసలు కాదంబరి జెత్వానీ ఏ సినిమాల్లో నటించింది.? ఆమెను వైసీపీ నేతలెలా వేధించారు.? అన్న విషయాలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది.
కేవలం కాదంబరి జెత్వానీ మాత్రమేనా.? ఇలాంటి బాధితులు ఇంకా చాలామందే వున్నారా.? అన్న అనుమానాలూ తెరపైకొస్తున్నాయి.
కాగా, ఓ మహిళా పోలీస్ అధికారిణిని ఈ కేసు నిమిత్తం ప్రత్యేకంగా నియమించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
ఈ కేసుతో సంబంధం వున్న పోలీస్ అధికారులను ఆ పోలీస్ ఉన్నతాధికారి నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారించనుందిట.