Table of Contents
ఔను, విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు పట్టింది. విద్యాదానం (Right To Education) మహాదానం.. అని ఒకప్పుడు పెద్దలు చెబితే, ఇప్పుడు విద్య అనేది అత్యద్భుతమైన వ్యాపార వస్తువుగా (Corporate Education System) మారిపోయింది. విద్యా రంగంలో దోచుకున్నోడికి దోచుకున్నంత. అసలు విద్య అంటే ఏంటి.? అన్న మౌలిక సూత్రాన్ని ఎప్పుడో అందరూ మర్చిపోయారు.
‘చదువుకోవడం’ అటకెక్కి, ‘చదువుకొనడం’ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఏ ప్రైవేటు విద్యా సంస్థకు (Private Educational Institute) వెళ్ళినా అక్కడ ‘మంచి మంచి శ్లోకాలు’ దర్శనమిస్తాయి. ‘గొప్ప వ్యక్తుల మాటలు’ కనిపిస్తాయి. ‘నీతి వంతమైన స్లోగన్లూ’ దర్శనమిస్తాయి.
చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్ డాష్ అన్నట్టు, అక్కడ జరిగేదంతా వ్యాపారమే అయినప్పుడు, నీతులెందుకు.? ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే స్లోగన్ దాదాపు అన్ని విద్యా సంస్థల్లోనూ (Educational System In India) కనిపిస్తుంది.
Also Read: పర్యావరణ పరిరక్షణ: ప్రకృతికి మనం ఏమిస్తున్నాం.?
విద్యార్థి (Students) ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం ధర్మమా.? అక్కడే ధర్మం చచ్చిపోయింది, ఇక విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడానికి అవకాశమెక్కడుంటుంది.?
ప్రభుత్వ స్కూళ్ళు (Government Schools Government Colleges), కాలేజీల వైపు ఎప్పుడైతే విద్యార్థుల తల్లదండ్రులు చూడటం మానేశారో, అప్పటినుంచి ‘దోపిడీ’ అత్యంత వేగంగా విస్తరించింది.
ఈ పాపంలో తల్లిదండ్రులకీ (Parents and Students Problems With Private Education) భాగం వుంది. పక్కింటోడు పెద్ద ప్రైవేటు విద్యా సంస్థలో (Private Schools Private Colleges) తమ పిల్లాడ్ని చదివిస్తే, అందుకు పోటీగా తామూ తమ పిల్లలకు అంతకంటే పెద్ద ఫీజులు చెల్లించి చదివించేయాలన్న ‘పైత్యం’ ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది.
Also Read: ఆయుర్వేద వైద్యం VS మోడ్రన్ మెడిసిన్.!
చదువుతున్న చదువులకీ, చేస్తున్న ఉద్యోగాలకీ సంబంధం లేని రోజులివి. అయినాగానీ ‘డబ్బు జబ్బు’ (Fee Torture To Students And Parents With Private Educational Institutions) తగ్గడంలేదు సరికదా, మరింత పెరిగిపోయింది. సమాజాన్ని క్యాన్సర్‌లా ఈ ‘జబ్బు’ పట్టి పీడించేస్తోంది. ప్రభుత్వాలన్ని శాసించే స్థాయికి ప్రైవేటు విద్యాసంస్థలు ఎదిగిపోయాక, విద్యా రంగంలో ప్రక్షాళన జరుగుతుందనీ.. అదీ రాజకీయ పార్టీలో, ప్రభుత్వాలో చేస్తాయని అనుకోలేం.
ఎక్కడి నుంచైతే వ్యవస్థ నాశనమైపోవడం ప్రారంభమయ్యిందో.. అక్కడి నుంచే మళ్ళీ ‘బాగు’ (Right To Education) కూడా మొదలవ్వాలి. అంటే, తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. ఎక్కడ చదివినా ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు అవుతుంది తప్ప.. ప్రభుత్వ స్కూళ్ళలో ఒక సమాధానం, ప్రైవేటు స్కూళ్ళలో ఇంకో సమాధానం రాదు కదా.?
Also Read: పరీక్షలకు లాక్ డౌన్.. చదువుల పరిస్థితేంటి చెప్మా.!
‘ఎల్కేజీ, యూకేజీ ఫీజులే లక్షల్లో వుంటున్నాయ్ మొర్రో..’ అని ఏడవడం మానేసి, మనం వున్న వ్యవస్థని మనం బాగుచేసుకోవడమెలాగో (Right To Education) ఆలోచిస్తే, భావితరాలకు మంచి బాటలు వేసినవాళ్ళమవుతాం.
చిన్న వయసు నుంచే పిల్లల మెదళ్ళను చదువుతో కాకుండా, ఫీజుల పేరుతో ప్రైవేటు చదువుల ముసుగులో డబ్బులో వారిని ముంచి తేల్చుతోంటే.. భవిష్యత్తులో వాళ్ళు సమాజానికి ఉపయోగపడేలా ఎదుగుతారా.? ఎంత ఖర్చు చేసి చదువుకున్నాం.? ఎంత సంపాదించాలి.? అన్న ఆలోచనలతోనే కదా పెరిగేది.? తద్వారా భవిష్యత్తులో వ్యక్తిత్వం, సమాజం పట్ల బాద్యత (Right To Education) అనేవి అటకెక్కి, నిఖార్సయిన ‘డబ్బు జబ్బు’కి అలవాటుపడిపోరూ.!