Table of Contents
ట్రెండ్ చాలా చాలా చాలా మారిపోయింది. ఎలాంటి దుస్తులు ధరించాలి.? అన్న విషయమై రచ్చ రోజురోజుకీ శృతి మించుతోంది. అమ్మాయిలు పొట్టి దుస్తులు (Ripped Jeans The New Style Mantra Of Youth) ధరించడం మంచిది కాదంటూ పెద్దలు ఒకప్పుడు చెప్పిన మాటలు, ఇప్పుడు చెత్త బుట్టల్లో పడెయ్యాల్సిందే.
టోన్డ్ జీన్స్.. రిప్‌డ్ జీన్స్.. (Ripped Jeans) ఇలా రకరకాల పేర్లతో నయా ట్రెండ్ దుస్తులు యువతని ఆకర్షిస్తున్నాయి.
Also Read: Bold Talk: డేటింగుల్లోనూ పొట్టీ.. పొడుగూ.!
‘అదేం ప్యాంటురా.. అడుక్కుతినేవాడిలా వుంది నీ వాటం..’ అని ఓ సినిమాలో హీరో తండ్రి, తన కుమారుడి డ్రెస్ సెన్స్ మీద సెటైర్లు వేస్తాడు. అది చూసి నవ్వుకుంటాం. థియేటర్ల మీద దాడి చేసెయ్యం. అదే, ఓ రాజకీయ నాయకుడు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చాడో.. అంతే సంగతులు.. విరుచుకుపడిపోతాం.
సభ్యత, సంస్కారం.. కొలమానమేంటి.?
‘సభ్యత, సంస్కారం మర్చిపోవద్దు..’ అని పెద్దలు చెప్పిన మాటని ప్రస్తావిస్తే, అంతెత్తున కోపమొచ్చేస్తుంటుంది నేటి యువతరానికి. తప్పదు మరి, ట్రెండ్ అలాంటిది. ఏ తరహా దుస్తులు ధరించాలో నేటి యువతరానికి పెద్దోళ్ళు ఉచిత సలహాలు ఇస్తే ఎలా.?
జీన్స్ ప్యాంట్లు చింపేసుకుంటారు.. ఇంకేవేవో చేస్తుంటారు. అబ్బాయిలు, అమ్మాయిలు.. ఈ విషయంలో ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు.
Also Read: విద్యాబాలన్ ఫ్యాషన్ మంత్ర: బోల్డ్ అండ్ బ్యూటిఫుల్.!
అబ్బాయిల్ని కంట్రోల్‌లో పెట్టుకోండి, ఆ తర్వాత అమ్మాయిల వస్త్రధారణపై కామెంట్లు చేయండంటూ మహిళా సంఘాలు గుస్సా అవుతాయి, ఎవరన్నా నీతులు చెబితే.
అసభ్యం చూసే కళ్ళల్లోనే సుమీ..
ఎవరి గోల వారిదే. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, కాస్త కొత్తగా ఆలోచించాల్సిందేనంటోంది నేటి యువత. ఇందులో అసభ్యత.. అన్న మాటకు అర్థమే మారిపోయింది.
చూసే కళ్ళల్లో అసభ్యత తప్ప.. తాము చూపించే అంగాంగ ప్రదర్శనలో అసలు అసభ్యత వుండనే వుండదని నేటి యువతరం బల్లగుద్ది చెబుతోంది.
Also Read: నయా ట్రెండ్: విడాకులూ బ్రేకప్పూ వాట్సప్పూ.?
ఔనౌను, చూసే కళ్ళదే తప్పు. నచ్చితే చూసి ఆనందించండి, నచ్చకపోతే మొహం తిప్పేసుకోండి. అంతే తప్ప, కామెంట్లేశారో ఊరుకునేది లేదని యువతరం హెచ్చరిస్తోంది.
అందుకే, వస్త్రధారణ విషయంలో యువతరం మీద.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, మహిళల మీద (Ripped Jeans The New Style Mantra Of Youth) కామెంట్లు వేశారో, రాజకీయ నాయకులకు చిరిగి చేటైపోతుందంతే.