Home » ప్చ్.! ‘సికిందర్’ డిజాస్టర్ రష్మిక ఖాతాలోకి.!

ప్చ్.! ‘సికిందర్’ డిజాస్టర్ రష్మిక ఖాతాలోకి.!

by hellomudra
0 comments
Rashmika Mandanna

Rashmika Mandanna Sikandar.. అరరె.! ఒక్క సినిమాతోనే రష్మిక మండన్న ఐరన్ లెగ్ అయిపోయిందే.! ‘ఈద్’ స్పెషల్‌గా వచ్చిన ‘సికిందర్’ సినిమా ఫ్లాప్ కాస్తా, రష్మిక ఖాతాలో వేసేశారే.!

నేషనల్ క్రష్ రష్మిక మండన్న, ఇటీవల ఏ సినిమా చేసినా.. ఆ సినిమా అనూహ్యంగా హిట్టయిపోతోంది. కాదు కాదు, హిట్టయ్యిందనిపించేస్తున్నారు.

‘పుష్ప 2 ది రూల్’ సినిమా విషయానికొస్తే, ఈ సినిమాపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. అందులోని రష్మిక పాత్రపైనా చాలా విమర్శలు వచ్చాయి.

Rashmika Mandanna Sikandar.. వందల కోట్లు.. వేల కోట్లు.. రష్మిక పాట్లు.!

కట్ చేస్తే, సినిమా వందల కోట్లు కాదు, వేల కోట్లు కలెక్ట్ చేసేసిందంటూ.. పబ్లిసిటీ స్టంట్లు నడిచాయ్. మొత్తంగా చూస్తే, అదో పెద్ద హిట్, రష్మిక ఖాతాలో.!

బాలీవుడ్ సినిమా ‘చావా’ విషయంలో ఇంకాస్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ రష్మికకి.! సినిమా క్వాలిటీ లేకపోయినా, అందులోని దేశ భక్తి కంటెంట్.. ఆ సినిమాకి ప్లస్ అయ్యింది.

Rashmika Mandanna Salman Khan Sikandar
Rashmika Mandanna Salman Khan Sikandar

సో, ‘చావా’ పెద్ద హిట్.! ఈ హిట్టు కూడా రష్మిక ఖాతాలోనే. ఇంతకీ, సినిమాలో రష్మిక పాత్ర నిడివి ఎంత.? ఆమె, తనకు దక్కిన పాత్రలో ఎంత గొప్పగా నటించింది.? ఇవన్నీ అసలు ప్రస్తావనకే రాలేదు.

రెండు హిట్లు రష్మిక ఖాతాలో వేసేసినప్పుడు, ఫ్లాప్ కూడా రష్మిక ఖాతాలో పడెయ్యాలి కదా.! అదే జరిగిందిప్పుడు. సల్మాన్ ఖాన్ సినిమా ‘సికిందర్’కి తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది.

ఐరన్ లెగ్గూ.. గోల్డెన్ లెగ్గూ.!

ఏమో, ఏదన్నా మ్యాజిక్ జరిగి, ‘సికిందర్’ని కూడా హిట్టు ఖాతాలో పడేస్తే. మళ్ళీ రష్మిక గోల్డెన్ లెగ్ అయిపోతుందన్నమాట.

ఎలా చూసినా, రష్మిక సుడి మాత్రం వేరే లెవల్‌లో వుందంతే.! అన్నట్టు, రష్మిక చేయాల్సిన ‘రాబిన్ హుడ్’లో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Also Read: ఆకాంక్ష.. తియ్యటి ‘ఖాకీ’ గాయం.!

‘రాబిన్ హుడ్’ బాక్సాఫీస్ రిజల్ట్.. ప్చ్, తేలిపోయింది.! అదే, రష్మిక చేసి వుంటే హిట్టయ్యేది తెల్సా.. అనే కామెంట్లూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయండోయ్.!

రష్మిక – నితిన్ నటించిన ‘భీష్మ’ మంచి విజయాన్ని అందుకుంది. ‘భీష్మ’ తర్వాత ఫ్లాపు మీద ఫ్లాపు కొడుతున్నాడు నితిన్.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group