ఇదేదో ట్రెండింగ్ కోసం వండి వడ్డించిన వార్తా వ్యవహారం కాదు. నిజంగానే, ఆ వెజిటబుల్ ధర కిలో లక్ష రూపాయలు. అత్యల్ప ధర 85 వేల రూపాయలు కాగా, అత్యధిక ధర లక్ష పై మాటే. సరాసరిన ఈ పంట పండిస్తే రైతు కిలో ‘వెజిటబుల్’ అమ్మేసి లక్ష రూపాయలు జేబులో వేసుకోవచ్చు. ఈ పంట పేరు హోప్ షూట్స్ (Hop Shoots Costliest Vegetable In The World).
విదేశాల నుంచి మన దేశంలోకి ఇంపోర్ట్ అయ్యింది ఈ కొత్త రకం వెజిటబుల్. దీన్ని కూరగాయ అనాలో, ఇంకేమనాలో ఎవరికీ తెలియని పరిస్థితి. వేర్లు, కాండం, ఆకులు, పండ్లు.. ఇలా అన్నీ వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. బీరు తయారీలోనూ, మందుల తయారీలోనూ.. ఉపయోగపడటమే ఈ హోప్ షాట్స్ ప్రత్యేకత అట.
ప్రస్తుతం బీహార్ రైతు ఒకరు ఈ పంటని పండిస్తున్నారు. మరోపక్క, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ పంటను పండించారు కొందరు రైతులు. అయితే, మార్కెటింగ్ సౌకర్యం లేక, రైతులు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.
కాగా, కిలో పంట ధర లక్ష రూపాయలు కావడంతో.. దీన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో పండించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. సరైన మార్కెటింగ్ ధర కల్పిస్తే, సగం ధర కాదు కదా, పావు వంతు ధర వచ్చినా లాభాలు వస్తాయనీ, అప్పుడు రైతులు మహరాజులవుతారనీ వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా వుంటే, దీంట్లో హైబ్రీడ్ రకం కూడా వుందనీ, దానికి పెద్దగా ధర పలకదనీ చెబుతున్నారు. ఎరువులు వాడకుండా హోప్ షూట్స్ పంటను పెంచగలిగితే, వ్యవయసాయం పండగే అవుతుందన్నది నిర్వివాదాంశం.
క్యాన్సర్ వైద్య చికిత్సకు ఉపయోగించే మందుని కూడా ఈ హోప్ షాట్స్ మొక్క నుంచి తయారు చేస్తారట. టీబీని నయం చేసే గుణం కూడా ఈ ‘హోప్ షాట్స్’కి వుందని చెబుతున్నారు. అదండీ కిలో లక్ష రూపాయల విలువ చేసే వెజిటబుల్ హోప్ షూట్స్ (Hop Shoots Costliest Vegetable In The World) అసలు కథ.