ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే, ఆయన పేరు తెలియనివారు ప్రపంచంలో ఎవరూ వుండరు. అసలు బిల్ గేట్స్ (Bill Gates and Melinda Gates Love Story Divorce) సాయం పొందని దేశమే లేదనడం అతిశయోక్తి కాదేమో. లక్షల కోట్ల సంపాదన ఓ వైపు, లక్షణమైన మానవత్వం ఇంకో వైపు.. వెరసి ఈ టెకీ దిగ్గజం.. ఓ సంపూర్ణ వ్యక్తిత్వం వున్న గొప్ప మనిషి.
బిల్ గేట్స్ పేరు ఇప్పుడు వార్తల్లో మార్మోగిపోతోంది. కారణం, భార్య మిలిందా గేట్స్ నుంచి బిల్ గేట్స విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడమే. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట (Bill Gates Melinda Gates Divorce), ఇన్నేళ్ళ వైవాహిక బంధానికి ఎందుకు గుడ్ బై చెబుతున్నట్లు.? కారణాలు వెల్లడించలేదుగానీ, తామిద్దరం విడిపోతున్నట్లు మాత్రం ప్రకటించి, తమ వ్యక్తిగత జీవితం విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరడం గమనార్హం.
బిల్ గేట్స్ – మిలిందా గేట్స్.. (Bill Gates Melinda Gates Love Story) అంటే, పేరు ప్రఖ్యాతులే కాదు, అంతకు మించిన ప్రత్యేకత వారికి వుంది. లక్షల కోట్ల సంపద ఓ వైపు, అదే స్థాయిలో సేవా కార్యక్రమాలు ఇంకో వైపు. అందుకే, బిల్ – మిలిందా విడిపోయాక, ఆస్తుల పంపకం ఎలా.? అని ప్రపంచమంతా ఆరా తీస్తోంది.
మరోపక్క బిల్ – మిలిందా తమ ఫౌండేషన్ (Bill Melinda Gates Foundation) ద్వారా సేవా కార్యక్రమాలు ఇదివరకటిలా కొనసాగిస్తారా.? లేదా.? అన్న చర్చ కూడా జరుగుతోంది. వారిచ్చే డొనేషన్ల పట్ల ఎంతో ఆశగా ఎదురు చూసే కొన్ని దేశాలు ఇప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అయితే, వైవాహిక బంధం విషయంలో తాము తెగతెంపులు చేసుకుంటున్నా, సేవా కార్యక్రమాలు ఇదివరకటి కంటే గొప్పగానే కలిసి కట్టుగా కొనసాగిస్తామని బిల్, మిలిందా ప్రకటించడం కాస్త ఊరట.
ఎక్కడన్నా సెలబ్రిటీలు విడిపోతే అదో హాట్ న్యూస్. దాని చుట్టూ చాలా పుకార్లుంటాయి. ఈ సెలబ్రిటీలు.. చాలా చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళ మనసులు చాలా చాలా పెద్దవి.. సున్నితమైనవి.. పేదల కోసం ఆరాటపడేవి.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న బిల్ గేట్స్ (Bill Gates)- మిలిందా గేట్స్ (Melinda Gates) గురించిన ‘ప్రేమ కథలు’ కుప్పలు తెప్పలుగా అందుబాటులో వున్నాయి. ఇలా ప్రేమించుకున్నారట.. ఇలా పెళ్ళి చేసుకున్నారట.. పెళ్ళి చేసుకున్నాక కూడా ఇంతలా ప్రేమించుకున్నారట.. అంటూ ఈ ఇద్దరి గురించి ఎన్నెన్నో ప్రేమ కథలు. అవన్నీ మధురమైనవి. విడిపోవడం (Bill Gates and Melinda Gates Love Story Divorce) మాత్రం.. అత్యంత బాధాకరమే.