Team RRR have released a video, which has a genuine message to all people regarding the Corona Pandemic (RRR Team Genuine Appeal To People On Covid 19).
Stay Safe, Stay Vaccinated, Wear Mask and maintain Social distance – RRR Team (Ram Charan, Jr NTR, Alia Bhatt, Ajay Devgn, SS Rajamouli) have appeared in the video and have given the message in different languates like Telugu, Tamil, Kannada, Malayalam and Hindi.
కరోనా పాండమిక్ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్, ఓ ఆసక్తికరమైన వీడియో విడుదల చేసింది. ఇది సినిమా ప్రమోషన్ కోసం కాదు. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలనే మంచి మెసేజ్ ఈ వీడియో ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, అజయ్ దేవగన్, అలియా భట్ ఇచ్చారు.
ఒక్కొక్కరూ ఒక్కో భాషలో.. అంటే తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అన్నమాట. అలియా భట్ తెలుగులో మాట్లాడటం గమనార్హం. చరణ్, తమిళ భాషలో మాట్లాడాడు. ఎవరూ తమ మాతృభాషలో మాట్లాడలేదు ఒక్క అజయ్ దేవగన్ తప్ప.
‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా సినిమా కదా.. ఈ సినిమాపై వున్న అంచనాల నేపథ్యంలో, తాము చెప్పే మంచి మెసేజ్ (RRR Team Genuine Appeal To People On Covid 19), అందరికీ చేరాలన్న ఉద్దేశ్యంతో రాజమౌళి ఇలా ప్లాన్ చేసినట్లున్నాడు. రామ్ చరణ్, అలియా.. కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే.