భారత క్రికెట్ గురించి చర్చించుకోవాలంటే, ఖచ్చితంగా నవజ్యోత్ సింగ్ సిద్దూ గురించి మాట్లాడుకుని తీరాల్సిందే. డైనమిక్ బ్యాట్స్‌మెన్‌గా ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ సిద్దూ పేరు (Navjot Singh Sidhu Political Innings) మార్మోగిపోతుంది. మైదానంలో సిద్దూ ఎలాగైతే బ్యాటింగ్ చేసేవాడో, రాజకీయాల్లోనూ అంతే. ప్రస్తుతం పొలిటికల్ బ్యాటింగ్ విషయంలో సిద్దూ తనదైన రీతిలో సత్తా చాటేస్తున్నాడు.
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాక, క్రికెట్ వ్యాఖ్యాతగా పనిచేశాడు సిద్దూ. ఆ తర్వాత, బుల్లితెరపైనా, వెండితెరపైనా కనిపించాడు. ఎక్కడున్నాసరే, సిద్దూ తనదైన స్టయిల్లో మాటల బ్యాటింగ్ మాత్రం మానలేదు. రాజకీయాల్లో బహుశా ఆ మాటల బ్యాటింగే ఆయన్న ఈ స్థాయికి తీసుకొచ్చిందని అనుకోవాలేమో.
Also Read: Sachin Tendulkar.. ఈ క్రికెట్ దేవుడికి.. సాటెవ్వడు.!
బీజేపీ నుంచి లోక్ సభకు గతంలో ఎంపికైన నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఆ తర్వాత రాజ్యసభకు కూడా వెళ్ళారు. బీజేపీతో పొసగక, ఆ పార్టీ నుంచి బయటకొచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీకి పోటీ చేసి, గెలిచి.. పంజాబ్ మంత్రి కూడా అయ్యారు సిద్దూ. కానీ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో సిద్దూకి పొసగలేదు.
చెప్పుకుంటూ పోతే, సిద్దూ పొలిటికల్ కెరీర్లో చాలా ట్విస్టులున్నాయి. ఎన్నో పొలిటికల్ యార్కర్లను ఆయన రాజకీయాల్లో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో కొన్ని వివాదాలూ ఆయన్ని చుట్టుముట్టాయి. అందుక్కారణం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.. ఆ ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని. పాక్ – భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న పరిస్థితుల్లోనూ సిద్దూ – ఇమ్రాన్ మధ్య స్నేహం అలాగే వుండడం ఈ వివాదాలకి కారణం.
Also Read: జయహో భారత్.. తోకముడిచిన పాకిస్థాన్.!
పంజాబ్ కాంగ్రెస్ సారధిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ కొత్త ఇన్నింగ్స్ (Navjot Singh Sidhu Political Innings) ప్రారంభించారిప్పుడు. ఏమో, ఇక్కడ సిద్దూ బ్యాటింగ్ ఎలా వుంటుందోగానీ, ఈసారి పంజాబ్ ముఖ్యమంత్రి పీఠంపైనే ఆయన కన్నేశారనే ప్రచారం జరుగుతోంది.