Nikhil Siddhartha Slams Joe Biden.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ సినిమాల గురించే కాదు, అడపా దడపా రాజకీయాల గురించి కూడా స్పందిస్తుంటాడు. స్పందించాలి కూడా. కానీ, అంతర్జాతీయ పరిణామాలపై స్పందించే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఎలా.? పైగా, అమెరికా అధ్యక్షుడ్ని పట్టుకుని ‘ఎదవ’ అని తిట్టేయడం సమంజసమా.?
గతంలో రష్యా, ఇప్పుడు అమెరికా.. రేపు ఇంకెవరో. బలహీనమైన దేశాల్లో బలమైన దేశాలు ‘వికృత క్రీడలు’ ఆడటం కొత్తేమీ కాదు. ఆప్ఘనిస్తాన్ విషయంలో అమెరికా చేసింది అదే. అంతకు ముందు రష్యా కూడా ఇక్కడ అలాంటి వెకిలి, వికృత యుద్ధ క్రీడనే ఆడింది. అంతిమంగా ఆప్ఘనిస్తాన్ మరింత నాశనమవుతోందంతే.
Also Read: ఆన్‌లైన్ బూతు బాగోతం.. ఈ రోగానికి వ్యాక్సిన్ ఏదీ.?
నిజానికి, ఇక్కడ అమెరికానో.. రష్యానో విమర్శించాల్సిన పనిలేదు. ఎందుకంటే, తప్పంతా ఆప్ఘాన్లదే. ప్రపంచమెలా నడుస్తోంది.? అన్నది ఆప్ఘాన్ ప్రజలు గమనించకపోతే ఎలా.? అమెరికా, ఆప్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించగానే, తాలిబన్లకు ‘జీ హుజూర్’ అనేశారు ఆప్ఘాన్లు. ‘మా దేశంలో వుండలేం మొర్రో..’ అంటూ అమెరికా సహా ఇతర దేశాల కాళ్ళా వేళ్ళా పడుతున్నారు.
ఆప్ఘాన్ విషయంలో అమెరికా చేతి చమురు బాగానే వదిలించుకుంది. ఆ విషయం ఆలస్యంగా తెలుసుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రష్యా – ఆఫ్గాన్ – అమెరికా చరిత్ర గురించి చెప్పాలంటే అదో అంతులేని కథ.. వ్యధ కూడా. అందులోకి మన యంగ్ హీరో నిఖిల్ తల దూర్చాడు.
Also Read: తెగులు రాజకీయం: మహేషూ.. నీ కోసం వాళ్ళెవరూ రాలేదేం.?
ఆప్ఘాన్ల మీద ప్రేమ ఒలకబోస్తూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని పట్టుకుని ‘ఎదవ’ (Nikhil Siddhartha Slams Joe Biden) అనేశాడు. కోట్లాదిమంది అమెరికన్లు ఓటేసి గెలిపిస్తే.. బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. అగ్రరాజ్యం అమెరికా అధినేత ఆయన. అలాగని ఆయన్ని విమర్శించకూడదా.? అంటే, విమర్శించొచ్చు. కానీ, ఇంతలా తిట్టకూడదు.
అమెరికా అధ్యక్షుడ్ని తిట్టేశావ్ సరే.. భారత దేశ నాయకత్వాన్నిగానీ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్నిగానీ ఇలా తిట్టగలవా.. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపైన.? అని నిఖిల్ సిద్దార్ధని నెటిజన్లు నిలదీసేస్తున్నారు. సమాధానం చెప్పవా నిఖిల్.!