Ganesh Chaturthi హిందూ ధర్మంలో ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడినే స్మరించుకుంటాం. అది పూజయినా, గొప్ప కార్యక్రమమైనా, ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నాధిపతిని స్మరించుకుంటాం. దురదృష్టం ఏంటంటే, ఆ గణనాధుడికే వినాయక చవితి సందర్భంగా రాజకీయ విఘ్నం వచ్చి పడింది.
ముక్కుతోనే గాలి పీల్చాలి. నోటితోనే అన్నం తినాలి.. అని ఎవరైనా ఆదేశించినా, నీతులు చెప్పినా ఎలా ఉంటుంది.? ఇంట్లోనే పూజ చేసుకోండి.. అని ఏ ప్రభుత్వమయినా చెబితే అలాగే ఉంటుంది. కాలనీలో వినాయక మండపం పెట్టామని ఇంట్లో వినాయకుడికి పూజ చేయకుండా ఉంటామా.? కనీసపాటి ఇంగిత జ్ఞానం లేని వాళ్లు పరిపాలిస్తే ఇలాగే ఉంటుంది.
Also Read: చట్ట సభల్లో నేర చరితులు.. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
పెళ్లిళ్లు జరుగుతున్నాయ్. పెద్ద ఎత్తున అతిధులు హాజరవుతున్నారు. చావులు సంభవిస్తున్నాయ్. అంత్యక్రియలకీ పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. సినిమా ధియేటర్లు కిటకిటలాడుతున్నాయ్. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జన సమర్ధకంగా మారుతున్నాయ్. మార్కెట్లు కళకళలాడుతున్నాయ్. వాట్ నాట్.. ఎక్కడ చూసినా జనమే జనం.
రాజకీయ కార్యక్రమాలకైతే, డబ్బులిచ్చి మరీ జనాన్ని పోగేస్తున్నారు. వినాయక చవితి ఇంట్లోనే చేసుకోవాలి.. అని ఉచిత సలహాలిస్తున్న రాజకీయ నాయకులే డబ్బులిచ్చి జనాన్ని పోగేస్తున్నారు. వర్ధంతి పేరు చెప్పి, జన సమీకరణతో బల ప్రదర్శన చేస్తున్నారు. అక్కడెక్కడా.. కరోనా సమస్య లేదు.
Also Read: ఆంధ్రప్రదేశ్ రాజధానితో మూడు ‘ముక్క’లాట.!
వీధిలో వినాయకున్ని పెడితే, మాత్రమే కరోనా వస్తుందనే మూర్ఖులకి జ్ఞానోదయం కలగాలంటే, అది బహుశా వినాయకుడి వల్ల కూడా కష్టమేనేమో. వేరే ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాలకీ ఆంక్షల్లేవ్. హిందూ ధర్మం మాత్రమే ఆంక్షల్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది.? కేవలం హిందూ దేవాలయాల్లో మాత్రమే టిక్కెట్లు కొనుక్కొని దేవుణ్ణి దర్శించుకునే దౌర్భాగ్యం ఎందుకు పట్టింది.?