Table of Contents
Journalist Krishnam Raju Amaravati.. ఓ జర్నలిస్టు, వైసీపీకి చెందిన సాక్షి ఛానల్‌లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన ‘వ్యభిచార’ వ్యాఖ్యలు అత్యంత జగుప్సాకరం.!
యావత్ మహిళా లోకం, సదరు ‘పాత్రికేయ వ్యభిచారి’ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.
దేశవ్యాప్తంగా ‘సెక్స్ వర్కర్ల’ లెక్కలను ప్రస్తావిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో వున్న వైనాన్ని పేర్కొంటూ, అమరావతి మహిళలపై అత్యంత నీఛమైన వ్యాఖ్యలు చేశాడా పాత్రికేయ వ్యభిచారి.
Journalist Krishnam Raju Amaravati.. దేవతల రాజధాని కాదుట.. సెక్స్ వర్కర్లకి నిలయమట..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణిస్తుంటారన్న విషయాన్ని పేర్కొంటూ, అది నిజం కాదు, ‘సెక్స్ వర్కర్లకు నిలయం’ అని, ‘పాత్రికేయ వ్యభిచారి’ కృష్ణంరాజు ఆరోపించాడు.
అంటే, అమరావతిలో మహిళలందర్నీ ఉద్దేశించి ‘వ్యభిచారం’ వ్యాఖ్యల్ని ఆ పాత్రికేయ వ్యభిచారి చేసినట్లే కదా.?
అమరావతి మహిళలకు ఈ తరహా వేధింపులు ఇదే కొత్త కాదు. గతంలో కూడా వైసీపీ నేతలు, ‘కూకట్‌పల్లి ఆంటీలు’ అంటూ అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలకీ.. పాత్రికేయ వ్యభిచారికీ తేడా ఏంటి.?
ఆ వైసీపీ నేతలకీ, ఈ పాత్రికేయ వ్యభిచారి కృష్ణంరాజుకీ పెద్దగా తేడా ఏమీ లేదు. చేసిన తప్పుకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి, ‘నేను అలా అన్లేదు’ అంటూ ఇంకా బుకాయిస్తూనే వున్నాడు కృష్ణంరాజు.
వీడిని జర్నలిస్టు.. అని ఎవరైనా అంటే, పాత్రికేయ వృత్తినే అవమానించినట్లు అవుతుంది. గణాంకాల్ని పట్టుకుని, ఓ ప్రాంతానికి.. అందునా, రాజధాని అమరావతికి ‘వ్యభిచారం’ ఆపాదించడమేంటి.?
వైసీపీ నేతలేమో అమరావతి ఆంటీలన్నారు.. వైసీపీ మద్దతుదారుడైన జర్నలిస్టేమో ఏకంగా అమరావతి మహిళలపై వ్యభిచార ముద్ర వేసేశాడు.
రాజధాని అంటే, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం..
రాష్ట్ర రాజధాని అంటే, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. రాజధాని అమరావతి పురిటి బిడ్డతో సమానం ఇప్పుడు. పూర్తిస్థాయి రాజధానిగా రూపాంతరం చెందడానికి, ఎన్నో బాలారిష్టాల్ని అధిగమించాల్సి వుంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతిపై ‘వ్యభిచారం’ అనే ముద్ర వేస్తున్న పాత్రికేయ వ్యభిచారి కృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంది.
అయినా, అమరావతి అంటే వైసీపీకి కావొచ్చు, వైసీపీ పాత్రికేయ వ్యభిచారులకు కావొచ్చు.. ఎందుకింత వ్యతిరేకత.? రాష్ట్రంలో అదొక ప్రాంతం.!
Also Read: విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాల్సిందేనా.?
వైసీపీ అధికారంలో వున్నప్పుడు, రాష్ట్ర రాజధాని అమరావతిని ఎంతలా నిర్లక్ష్యం చేశారో చూశాం. ఆ ఐదేళ్ళలో, రాజధాని నిర్మాణ పనుల్ని కాస్తయినా పట్టించుకోలేదు.
అమరావతిని నిర్వీర్యం చేసేందుకు మూడు రాజధానులంటూ కుట్ర పన్నింది వైసీపీ. తాము చెప్పిన మూడు రాజధానుల్లో ఒకటైన అమరావతి మీద మాత్రం విషం చిమ్మిుతూ వస్తోంది.
అధికారం కోల్పోయాక కూడా, అమరావతి మీద వైసీపీ కుట్ర.. అలానే కొనసాగుతూ వస్తోంది.