ప్రతి యేడాదీ విజయదశమినాడు.. రావణ దహనం జరుగుతుంటుంది. గతంలో అయితే, చాలా కొన్ని ప్రాంతాలకే ఈ ‘రావణ దహనం’ (Ravana Dahanam) అనే కార్యక్రమం జరిగేది. క్రమక్రమంగా అది కూడా ఓ ప్రత్యేకమైన పండుగగా మారిపోయింది. పెద్దయెత్తున జనం గుమికూడటం, రాజకీయ నాయకులు.. ‘రావణ దహనం’ అనే కార్యక్రమాన్ని సంబరంలా జరపడం ఓ ఆనవాయితీగా కనిపిస్తోంది.
అదే సమయంలో, ‘రావణ దహనం’ చుట్టూ వివాదాలు కూడా సర్వసాధారణమైపోయాయి. రావణుడ్ని (Ravana Brahma) దేశంలో కొన్ని చోట్ల దేవుడిగా పూజిస్తారు. అలాంటి దేవుడ్ని అవమానించడమే ‘రావణ దహనం’ తాలూకు ఉద్దేశ్యమన్నది కొందరి వాదన. చిత్రమేంటంటే, ఇందులోకి కులాల కుంపట్లను కూడా తీసుకొస్తున్నారు కొందరు.
అసురుడే.. కానీ, రావణ బ్రహ్మ అతడు..
హిందూ ధర్మంలో (Hindu Dharma) రావణుడ్ని ‘రావణ బ్రహ్మ’ అని అభివర్ణిస్తుంటాం. రావణుడు లంకాధీశుడు. అయితే, అతని అసుర స్వభావమే అన్ని సమస్యలకూ కారణం. రావణుడు, సీతమ్మను చెరబట్టిన మాట వాస్తవం. రామ లక్ష్మణులతో కలిసి సీతాదేవి అరణ్యవాసానికి వెళితే, అదను చూసి రావణుడు, సీతాదేవిని ఎత్తుకెళతాడు.
Also Read: శ్రీకూర్మం.. కూర్మావతారంలో శ్రీ మహా విష్ణువు కొలువుదీరిందిక్కడే.!
అలాగని, రావణుడు (Sri Ramudu) అసలు సీతను (Sita Devi) తాకాడా.? అంటే అదీ లేదు. పర స్త్రీపై వ్యామోహమే రావణుడ్ని అంతమొందించింది. రావణుడు అపహరించిన సీతాదేవిని తీసుకొచ్చందుకోసం రాముడు, ఏకంగా లంకకు వారధి నిర్మిస్తాడు సముద్రం పైన.
తప్పు చేశాడు.. శిక్ష అనుభవించాడు.. మోక్షం పొందాడు..
‘రాముడు (Jai Sri Ram) ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు.?’ అని ప్రశ్నించే మూర్ఖుల గురించి ఇక్కడ ప్రస్తావించుకోవడం అనవసరం. అది అతి పురాతనమైన, వేల ఏళ్ళ క్రితం.. అంతకన్నా ముందు ఎప్పుడో లక్షల ఏళ్ళ క్రితం నిర్మితమైన మానవ కట్టడంగా పలు పరిశోధనలు తేల్చాయ్. అది వేరే సంగతి.
రావణుడ్ని (Ravana) దేవుడిగా పూజించేవారూ దేశంలో వున్నారు. ఇక్కడ సమస్య రావణుడిలోని అసుర లక్షణం. రావణ సంహారం.. (Ravana Dahanam) అంటే, అసుర లక్షణాన్ని సంహరించడం. రావణ వధ అయినా, నరకాసుర వధ అయినా.. అసుర లక్షణాన్ని వధించడం. అంతే తప్ప, ఇందులో కుల దురహంకారమో.. ఇంకొకటో లేనే లేదు.
రావణ సంహారానికి సంబంధించి మరో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే.. రావణుడు, తన అహంకారం చేత నాశనం కాబడ్డాడు.. రావణుడి బాగు కోరి అతన్ని హెచ్చరించాడు విభీషణుడు. కానీ, విభీషణుడ్ని రావణుడు లెక్క చేయలేదు.
రావణుడ్ని ఎవరైతే నమ్మారో, వాళ్ళంతా రామ – రావణ యుద్ధంలో చనిపోయారు. రావణుడు తనతోపాటు, తనవారందర్నీ తన అహంకారం కారణంగా ప్రమాదంలోకి నెట్టేసి, వారందరి చావుకి కారణమయ్యాడు.