Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది. ఈ ఇద్దరికీ పెళ్ళెప్పుడు.? అన్న విషయమై ఎప్పటికప్పుడు కొత్త కొత్త గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అనీ, ఇంకోటనీ.. ఇలా పుకార్లు వచ్చిన ప్రతిసారీ, మలైకా అరోరా జస్ట్ ‘నవ్వేసి’ ఊరుకుంటుందతే.
నిజానికి, మలైకా అరోరా ఆల్రెడీ పెళ్ళయిన మహిళ. కొన్నాళ్ళ క్రితమే విడాకులు తీసుకుంది మొదటి భర్త అర్భాజ్ ఖాన్ నుంచి మలైకా అరోరా విడిపోయి చాన్నాళ్ళే అవుతోంది. మలైకా – అర్జున్ కపూర్ మధ్య వయసు తేడా చాలా ఎక్కువే.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
తనకన్నా వయసులో చాలా పెద్దదైన మలైకాతో అర్జున్ ఎలా ప్రేమలో పడ్డాడన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నేనంటారు బాలీవుడ్ సినీ పరిశ్రమలో చాలామంది.
Malaika Arora వయసేంటి.? అర్జున్ కపూర్ వయసేంటి.?
సరే, ప్రేమకు వయసుతో సంబంధం లేదనే వాదనా లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ, అర్జున్ కపూర్ – మలైకా అరోరాల పెళ్ళెప్పుడు.? ఈ ప్రశ్నకు సమాధానం మళ్ళీ ‘తెలియదు’ అనే. ఎందుకంటే అటు మలైకా కావొచ్చు, ఇటు అర్జున్ కపూర్ కావొచ్చు.. అసలెప్పుడూ పెళ్ళి గురించి మాట్లాడిందే లేదు.

‘మేమిద్దరం ప్రేమికులం..’ అని పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా చెబుతూ వస్తున్న ఈ జంట, పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాం.. అని విడివిడిగా పలు సందర్భాల్లో సెలవిచ్చారు తప్ప, పెళ్ళెప్పుడన్న ప్రశ్నకైతే సరైన సమాధానమివ్వడంలేదు.
పెళ్ళి.. వాళ్ళిద్దరి కోసం..
‘అయినా, పెళ్ళి అనేది ఆ ఇద్దరి వ్యక్తుల ఇష్టం. ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలన్నది వాళ్ళిష్టమైనప్పుడు, దాని గురించి వాళ్ళను అంతలా ఇబ్బంది పెట్టడం అనవసరం..’ అంటూ మలైకా, అర్జున్‌ల సన్నిహితులు సుద్దులు చెబుతున్నారు మీడియాకి.
‘వాళ్ళకి పెళ్ళి అవసరం అనుకుంటే చేసుకుంటారు తప్ప.. ఇంకెవరి కోసమో వాళ్ళు పెళ్ళి చేసుకోవడం జరగదు’ అన్నది అర్జున్ అలాగే మలైకా (Malaika Arora) సన్నిహితుల అభిప్రాయంగా కనిపిస్తోంది.