Samantha Akkineni Naga Chaitanya: సమంత అక్కినేని.. అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో వున్న పేరుని ‘ఎస్’ అనే అక్షరంగా తొలుత సమంత మార్చేయడంతోనే, నాగచైతన్యకీ ఆమెకీ మధ్య వైవాహిక బంధానికి సంబంధించి ‘తేడాలు’ వచ్చాయని చాలామంది పసిగట్టారు.
ఓ సందర్భంలో ‘మీ భర్త నుంచి విడిపోతున్నారా.?’ అని ప్రశ్నిస్తే, ‘బుద్ధి వుందా.? గుడికి వచ్చి ఏం ప్రశ్నలేస్తున్నారు..’ అని సమంత గుస్సా అయ్యింది. కానీ, సమంత – నాగ చైతన్య అధికారికంగా తాము విడిపోతున్నట్లు ఆ తర్వాత ప్రకటించేశారు.
Samantha చెరిపేయాల్సిందే.. తప్పదు మరి.!
కాగా, సోషల్ మీడియా నుంచి మాత్రం సమంత, తన మాజీ భర్త నాగచైతన్య ఫొటోల్ని తొలగించడానికి కొంత సమయం తీసుకుంది. క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే ఆ ఫొటోల్ని తొలగించే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. ‘నాగచైతన్యతో ఆనాటి జ్ఞాపకాల్ని చెరిపేసుకునే దిశగా’ సమంత ప్రయత్నిస్తోందన్నది సుస్పష్టమవుతోందిక్కడ.

నిజానికి, సెలబ్రిటీలు.. ఇలా విడాకులు తీసుకోగానే, అలా తమ మాజీ జీవిత ‘భాగస్వామి’ తాలూకు ఫొటోల్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగిస్తుంటారు. సమంత ఈ విషయంలో కాస్త సమయం తీసుకుంది.
సమంతపై సోషల్ మీడియాలో రచ్చ ఆగట్లేదుగా..
ఇదిలా వుంటే, సమంత – నాగచైతన్య విడిపోవడానికి సంబంధించి సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతూనే వుంది. సమంత, చివరికి తన మీద జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలో కోర్టును కూడా ఆశ్రయించిన విషయం విదితమే.
Also Read: సమంత, నాగచైతన్య మధ్యలో అతనెవ్వడు.?
ఇంకోపక్క పక్క సమంత, విడాకుల తర్వాత.. విహార, ఆధ్మాత్మిక యాత్రలతో బిజీ అయిపోయింది. కొత్త సినిమాలకీ కమిట్ అవుతూ వస్తోంది. తెలుగులో ఆమె నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుండగా, తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది.
ఇంతకీ, నాగచైతన్యతో పెళ్ళయ్యాక.. అతని పేరుని తన శరీరంపై ఓ చోట పచ్చబొట్టుగా వేయించుకున్న సమంత, ఆ పచ్చబొట్టుని కూడా చెరిపేస్తుందా.? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి దూసుకొస్తోంది. మరి, ఈ విషయంలో సమంత (Samantha Naga Chaitanya) ఏం చేస్తుందో.!