అక్కినేని నాగచైతన్య, సమంత ఇటీవల విడాకులు (Samantha Naga Chaitanya Divorce) తీసుకున్నారు. విడాకుల వ్యవహారం వాళ్లిద్దరికీ సంబంధించింది. మధ్యలో మూడో వ్యక్తి జోక్యం అనవసరం. నాగచైతన్య తండ్రి నాగార్జున (Akkineni Nagarjuna) కూడా ఈ విషయమై ఇప్పటికే వివరణ ఇచ్చేశాడు. మాజీ కోడలు సమంత పట్ల తనకెప్పటికీ గౌరవ భావం ఉంటుందని నాగార్జున చెప్పాడు.
మధ్యలో ఈ ప్రీతమ్ జుకాల్కర్ (Preetham Jukalker) గొడవేంటీ.? సమంత స్టైలిస్ట్ ఈ ప్రీతమ్. సమంత, నాగచైతన్య విడాకులు జరిగిన వెంటనే జుగుప్సాకరమైన రీతిలో సోషల్ మీడియాలో నాగ చైతన్యకు వ్యతిరేకంగా ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన ఘనుడీ ప్రీతమ్.
డ్యామేజ్ చేసేస్తున్నాడు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రీతమ్ మొసలి కన్నీరు కార్చేశాడు ప్రీతమ్. తనని నాగ చైతన్య అభిమానులు టార్గెట్ చేశారనీ, సమంతతో తనకు అక్రమ సంబంధం అంటగడుతున్నారనీ వాపోయాడు. సమంతకీ, తనకీ మధ్య సోదరుడు, సోదరికి మధ్య ఉండే సంబంధమే ఉందనీ చెప్పుకొచ్చాడు ప్రీతమ్.
ఈ వివాదంపై, ఈ ట్రోలింగ్‌పై నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) స్పందించి, తన అభిమానులనుద్దేశించి ఓ ప్రకటన చేయాలని ప్రీతమ్ కోరుతున్నాడు. ఇదెక్కడి గొడవ.? నాగ చైతన్య ఎందుకు స్పందించాలి.? నాగ చైతన్య, సమంత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న విషయాన్ని ఇద్దరూ ఇప్పటికే వెల్లడించారు.
దురభిమానుల దురభిమానానికి ఎవరు జవాబుదారీ.?
ఒకరి మీద ఒకరికి గౌరవం అలాగే కొనసాగుతుందని, నాగ చైతన్య, సమంత (Samantha Ruth Prabhu) విడి విడిగా పేర్కొన్నాకా, అభిమానులు మాత్రం అందుకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారు.? కొందరు దురభిమానులు ట్రోలింగ్ చేస్తే, దాన్ని సెలబ్రిటీలు పట్టించుకోవల్సిన అవసరమే లేదు. సమంత (Samantha Akkineni) మీదనే కాదు, నాగ చైతన్య మీదా ట్రోలింగ్ జరుగుతోంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు.
సమంత, నాగ చైతన్య విడాకుల (Samantha Naga Chaitanya Divorce) వ్యవహారాన్ని పదే పదే కెలుకుతూ, పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న ప్రీతమ్ జుకాల్కర్ ఏం ఆశిస్తున్నాడు.? అన్నదే అసలు ప్రశ్న.