Bigg Boss Telugu 5 సీజన్ మొదలైనప్పటినుంచీ షన్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్నూ.. సిరి హన్మంత్ అలియాస్ సిరి మధ్య ఏదో నడుస్తోందనే ‘ప్రొజెక్షన్’ అయితే జరుగుతూ వస్తోంది. శ్రీరామచంద్ర – హమీదా మథ్య ట్రాక్ కూడా ఇలాంటిదే. వాస్తవానికి, బిగ్ బాస్ రియాల్టీ షోలో ఈ డ్రమెటిక్ ‘కెమిస్ట్రీ’ కొత్తేమీ కాదు.
మానస్ – ప్రియాంక మధ్య బలవంతంగా ఓ ట్రాక్ నడిపించేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. వామ్మో, ఇది ఏ టైపు ట్రాకు.? అని జనం జుట్టు పీక్కుంటున్నారనుకోండి.. అది వేరే సంగతి. లోబో – ఉమాదేవి మధ్య ట్రాక్ కూడా కొంత అయోమయంగా అనిపించింది అప్పట్లో.
Bigg Boss Telugu 5 ఆ ట్రాక్ సంగతేంటి.?
షన్నూ – సిరి మధ్య ట్రాక్ మాత్రం చాలా కాలంగా నడుపుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ప్రతి వీకెండ్‌లోనూ నాగార్జున తప్పనిసరిగా సిరి – షన్నూ మధ్య ట్రాక్‌కి సంబంధించి ‘ఆజ్యం’ పోస్తూ వస్తున్నాడు. అలా ఆ ట్రాక్ వెలుగుతూ వెలుగుతూ వస్తోంది.

సిరి హన్మంత్.. ఆల్రెడీ ఎంగేజ్డ్. షన్నూ విషయానికొస్తే, అతనికి దీప్తి సునయనతో లవ్ ట్రాక్ రియల్ లైఫ్‌లో నడుస్తోంది. అన్నట్టు, దీప్తి సునయన గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా రెండో సీజన్ బిగ్ బాస్ తెలుగు షోలో కనిపించిన సంగతి తెలిసిందే.
కాగా, సిరి హన్మంత్‌కి ఆమెక్కాబోయే భర్త నుంచి ఎప్పటికప్పుడు బహుమతులొస్తున్నాయ్. కానీ, షన్నూకి బహుమతులు పెద్దగా రావట్లేదు దీప్తి సునయన నుంచి. ఎందుకిలా.? ఏమో, ఈ మ్యాజిక్ ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
బిగ్ బాస్ అంటే.. అవన్నీ వుండాల్సిందేనేమో..
అన్నట్టు, సీజన్ వన్ విషయానికొస్తే ప్రిన్స్ – దీక్ష పంత్ మధ్య పెద్ద ట్రాక్ నడిచింది. ఆ రియాల్టీ షో అయ్యాక.. ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. మోనాల్ గజ్జర్ – అఖిల్ సార్ధక్ విషయంలోనూ అదే జరిగింది. అవినాష్ – అరియానా సంగతి సరే సరి.
Also Read: సుధీర్ – రష్మిల పెళ్లి గోల.. ఇంకెన్నాళ్ళిలా.?
సిరి – షన్నూ మధ్య బిగ్ బాస్ వేసిన ట్రాక్ కూడా అంతే. ఆ బిగ్ బాస్ హౌస్ సెట్ దాటి ఒక్క అడుగు కూడా ఈ ట్రాక్ ముందుకు వేసే అవకాశమే లేదు. కానీ, ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందన్న సంకేతాలు పంపడం.. అనేది కేవలం ‘షో’ (Bigg Boss Telugu 5) మీద ఆసక్తిని పెంచడం కోసమే.
అన్నట్టు, మొత్తం ఐదు సీజన్స్‌నీ పరిగణనలోకి తీసుకుంటే బీభత్సమైన ట్రాక్ పునర్నవి భూపాలం – రాహుల్ సిప్లిగంజ్ మధ్య నడిచిందే. అప్పుడు పున్నూ – రాహుల్.. ఇప్పుడు సిరి – షన్నూ.. అనుకోగలమా.? ఛాన్సే లేదు.. సిరి – షన్నూ మధ్య చాలా ఫోర్స్‌డ్‌గా నడుస్తోంది ట్రాక్.