Shyam Singha Roy.. నాని హీరోగా రూపొందుతోన్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాపై అంచనాలు అనూహ్యంగా పెరిగిపోవడానికి కారణం ఈ సినిమా బ్యాక్ డ్రాప్.
నాని (Natural Star Nani), సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్.. దానికి తోడు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) ఈ సినిమాలో నటిస్తుండడం, ‘శ్యామ్ సింగరాయ్’పై అంచనాలు అంతగా పెరిగిపోయాయి.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా ‘టాక్సీవాలా’ సినిమా తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యన్ ఈ ‘శ్యామ్ సింగారయ్’ సినిమాని తెరకెక్కించాడు. ‘అక్షరం పట్టుకున్న ఆయుధం..’ అంటూ శ్యామ్ సింగరాయ్’ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ప్రోమోలో అత్యద్భుతమైన విజువల్స్ మనల్ని వేరే మూడ్‌లోకి తీసుకెళ్లిపోతున్నాయ్.
Shyam Singha Roy నాని లెక్కే వేరప్పా..
నాని ఫెరోషియస్ బాడీ లాంగ్వేజ్ సినిమాపై ఇప్పటి దాకా ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసేశాయి. సాయి పల్లవి ఉగ్ర కాళీ మాతలా కనిపిస్తోంది. కృతి శెట్టి, నాని మధ్య రొమాంటిక్ సీన్ ప్రోమోలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రోమో అదిరిపోయింది.

‘స్ర్తీ ఎవడికీ దాసి కాదు..ఆఖరికి ఆ దేవుడికి కూడా ఖబడ్దార్..’ అంటూ నాని చెప్పిన డైలాగ్, ఆ డైలాగ్ చెప్పే క్రమంలో నాని పర్ఫామెన్స్ సింప్లీ సూపర్. అణచివేతపై పోరాడే ధీశాలిగా నాని నటించబోతున్నాడీ సినిమాలో. స్ర్తీని కాళికా దేవిగా చూపించే ప్రయత్నం సాయి పల్లవి ద్వారా చేస్తున్న దర్శకున్ని అభినందించి తీరాల్సిందే.
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క..
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క. నాని గురించి ‘శ్యామ్ సింగరాయ్’ ప్రోమో చూశాకా ఎవరైనా ముక్త కంఠంతో ఇదే మాట చెప్పాలి. నానికి ఇది తొలి ప్యాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు.
Also Read: RRR Mass Anthem.. చరణ్, ఎన్టీయార్.. వీరనాటు డైనమైట్లు.!
నటుడిగా నాని స్థాయిని పెంచడమే కాదు, తెలుగు సినిమా స్థాయిని ఇంకో స్థాయికి తీసుకెళ్లేలా ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) కనిపిస్తోంది.