Respect Women With Heart: ఆమె అంటే గౌరవం చాలామందికి.! ఆమె అంటే చులకన కొందరికి.! ఆమె లేని మనిషి జీవితానికి అర్థమే లేదు. అసలు మనిషి జీవితమే లేదు.! ఏడాదికోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవమట.! అసలంటూ ఆమె లేని రోజు ఏదైనా వుంటుందా.? ప్రతిరోజూ ఆమెదే.!
పొద్దున్న లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునే వరకూ..
మనిషి పుట్టిన నాటి నుంచి మరు భూమికి చేరేవరకూ..
ప్రతీక్షణం, ప్రతీ రోజూ మహిళ లేకుండా ఏ పనీ జరుగదు.
మనసుకు గాయం తగిలినా, శరీరానికి చిన్న గాయమైనా, ముందుగా నోట్లోంచి వచ్చే మాట ‘అమ్మా.!’ అని
ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ అక్కగా, ఓ కూతురుగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది మహిళ. ఉద్యోగమూ చేయగలదు. రాజ్యాన్నీ ఏలగలదు.
అందుకే పాలిచ్చి పెంచిన తల్లులు సామీ.. పాలించడం కూడా వచ్చు వాళ్లకి.. అంటూ మహిళ గొప్పతనం వుద్దేశ్యించి ఓ సినిమాలో హీరో చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Respect Women With Heart.. ఆమె ఓ అద్భుతం.!
మహిళ పాత్ర అంత గొప్పది కనుకే, ఆమెపై ఎన్నికవితలు రాసినా, ఎంత గొప్పగా వర్ణించినా తక్కువే అవుతుంది మరి. మనిషి జీవితం సార్ధకం అవ్వాలంటే, పైన చెప్పుకున్న ప్రతీ పాత్రతోనూ మనుగడ సాగించి తీరాల్సిందే.

పైన చెప్పుకున్నతల్లి, చెల్లి, అక్క, కూతురు.. ఇవేమీ రక్త సంబంధాలే కానవసరం కాదు, వేరే వ్యక్తుల్లో కూడా ఆ బంధాలను చూసుకుంటూ సాటి మనిషిగా సాంత్వన పొందుతుంటాం. ఆయా పాత్రలను స్పూర్తిగానూ తీసుకుంటుంటాం.
ఆమె..
Men ను కలుపుకుని Women అయ్యింది
He ను నింపుకుని She అయ్యింది.
మహిళ అనే పదంలోనే ‘మహి’ (ప్రపంచం) వుంది.
ఆమె..
దేవుడు సృష్టించిన అద్భుతం – జీవితంలో అపూర్వం
అణుకువ ఆమె సొంతం – అందం ఆమె పాదాక్రాంతం
ఆకలేస్తే అన్నపూర్ణ – అరాచకం వస్తే ఆదిశక్తి
కష్టమొస్తే కన్నతల్లి – ఓపికలో నేలతల్లి
పేగు బంధాన్ని పంచే అమ్మ – కొత్త బంధాల్ని పెంచే భార్య
అనురాగంలో అక్క – చిలిపిదనంలో చెల్లి
ఆమె చేసిన బొమ్మలం – ఆమె కన్నా ఎక్కువ అని ఎలా అనగలం.?
ఆమె చేయని పాత్ర లేదు – నెరవేర్చని ఘనత లేదు
ఉద్యోగంలో రాణించగలదు – రాజ్యాన్ని సైతం పాలించగలదు.
ఎంత గొప్పవాడైనా ఆమె గర్భాన గడపాల్సిందే.
ఎంతటి మొనగాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే.!
తన జీవితంలో ఓ మగాడు, మహిళకు ఎంత గొప్ప స్థానం ఇస్తాడో చెప్పడానికి ఈ వర్ణన ఓ చిన్నపాటి నిదర్శనం మాత్రమే. ఎవరో ఓ మహానుభావుడు.. ‘ఆమె’ గురించి ఇంత గొప్పగా వర్ణించాడు.! అద్భుతం కదా.!
మహిళ స్థానం వేరు. ఆమె స్థాయి వేరు.
మహిళా దినోత్సవం అనీ, మాతృదినోత్సవం అనీ, ఇంకో ప్రత్యేకమైన రోజనో ఆ ఒక్కరోజే మహిళను తలచుకుంటూ, పుంఖాలు, పుంఖాలు రచనలు, కొటేషన్ల మీద కొటేషన్లు రచించేస్తే సరిపోతుందా.?
Also Read: ముసుగు వేయాలా.? వద్దా.? ఏ ప్రయోజనం కోసం ఈ రగడ.!
‘ఆమె’ ప్రతీరోజూ ప్రత్యేకమే. ‘ఆమె’తో కలిసి వుండే ప్రతిక్షణమూ ప్రత్యేకమే. Respect Women With Heart.