Table of Contents
Pawan Kalyan Political Graph.. జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుత ‘గ్రాఫ్’ ఎలా వుందన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యేగా ఏడాది.. ఉప ముఖ్యమంత్రిగా ఏడాది.. ఇది నిజంగానే ఓ ప్రత్యేకమైన సందర్భంగా చెప్పుకోవాల్సి వుంటుంది జన సేనాని పవన్ కళ్యాణ్ విషయంలో.
తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్.. తొలి సారి ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.. 2024 ఎన్నికల్లో జన సేన పార్టీకి దక్కిన గెలుపు ఫలితాలు ఇవి.
Pawan Kalyan Political Graph.. గ్రాఫ్ ఏంటి.? గ్రౌండ్ రిపోర్ట్ ఎలా వుంది.?
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటే, మిస్టర్ క్లీన్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం, ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కనుసన్నల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఈ విషయాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలే ముక్తకంఠంతో చెబుతున్నారు.
స్కూళ్ళలో మార్పులు, ఆసుపత్రుల్లో మార్పులు.. రోడ్ల విషయంలో మార్పులు.. వాట్ నాట్.. పవన్ కళ్యాణ్ ముద్ర, అన్నిటిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
తన దృష్టికి ఏ సమస్య వచ్చినా, వెంటనే పరిష్కరించేందుకు పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
గౌరవ వేతనం.. అనాధల కోసం..
డిప్యూటీ సీఎంగా తనకు వస్తోన్న గౌరవ వేతనాన్ని, పిఠాపురం నియోజకవర్గంలో అనాధ పిల్లల అవసరాల నిమిత్తం, పూర్తిగా కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్.
డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెచ్చిన పవన్ కళ్యాణ్..
రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే చర్చ. అంతకు ముందూ డిప్యూటీ సీఎంలు వున్నారు.. కానీ, డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే.
తన శాఖల పరిధిలో, అభివృద్ధి కార్యక్రమాల విషయానికొచ్చేసరికి అస్సలేమాత్రం రాజీ పడ్డంలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఏ శాఖ అయినా.. అదే చిత్తశుద్ధి..
అది అటవీ శాఖ అయినా, గ్రామీణాభివృద్ధి శాఖ అయినా.. ఏ శాఖ అయినా సరే తనదైన మార్క్ పాలన ఆయా శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు.
విజయవాడ వరదల నేపథ్యంలో కోట్లాది రూపాయల స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్.
అలానే, ఓ స్కూలు విద్యార్థులు తమకు ఆటస్థలం లేదని చెప్పడంతో, తన స్వార్జితం నుంచి ఖర్చు చేసి, ఆట స్థలాన్ని కొనుగోలు చేసి, స్కూలుకు ఇచ్చారు జనసేనాని.
చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్.. రాజకీయాల్లో ఇంకెవరికీ సాధ్యం కాని ‘సేవా గుణాన్ని’ పవన్ కళ్యాణ్ చాటుకుంటున్న వైనం కొత్త తరం రాజకీయ నాయకులకు ఆదర్శం.
గిరిజన ప్రాంతాలకు రోడ్లు..
గిరిజన ప్రాంతాల్లో రోడ్లు.. పవన్ కళ్యాణ్ తెచ్చిన అతి పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.
వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లకు సంబంధించి, తన శాఖల పరిధిలో అత్యంత బాధ్యతతో బాగు చేయిస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఇంతలా, గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తోంటే, దానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ అని జనం విశ్వసించడంలో తప్పేముంది.?
ఎలా చూసుకున్నాసరే, గడచిన ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
Pawan Kalyan Political Graph.. అధినేత బాటలో..
అధినేత పవన్ కళ్యాణ్ బాటలో జన సేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ గ్రాఫ్.. అంచనాలకు మించి పెరిగింది గడచిన ఏడాది కాలంలో.. ఇది జనం మాట.!
పార్టీ నిర్మాణంపైనా జనసేన అధినేత ప్రత్యేక దృష్టి పెట్టిన దరిమిలా, రానున్న రోజుల్లో జనసేన రాజకీయంగా మరింత బలోపేతమవుతుందన్నది నిర్వివాదాంశం.
జాతీయ స్థాయిలో పొలిటికల్ పవర్ స్టార్..
పవన్ కళ్యాణ్ అంటే తుపాను.. అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడటం చూశాం. సనాతన ధర్మ పరిరక్షకుడిగా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గుర్తింపు, గౌరవం దక్కించుకున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్. ఎప్పటికప్పుడు నేషనల్ మీడియా, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ గురించి ప్రస్తావిస్తూనే వుంది.
ఇంట గెలిచిన, రచ్చ గెలవడం అంటే ఇదే మరి.! ఇదంతా జస్ట్ ఏడాది కాలంలోనే. ఔను, పవన్ కళ్యాణ్ అంటే, పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్. ఇది, నేషనల్ మీడియా చెబుతున్నమాట.