Nagababu New Journey : సినీ నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా వుంటారు. వివిధ అంశాలపై తనదైన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తుంటారు. సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యర్థులకు సోషల్ మీడియా వేదికగా ధీటైన రీతిలో సమాధానమిస్తుంటారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు, తెరవెనుక నాగబాబు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ’ని స్థాపించినప్పుడు మాత్రం, నాగబాబు మరీ అంత యాక్టివ్గా లేరన్న ప్రచారం జరిగింది.
సరే, ఆ విమర్శల సంగతి పక్కన పెడితే, నాగబాబు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు.. నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎందుకో జనసేన పార్టీలో అంత ముఖ్యమైన పాత్ర పోషించలేకపోయారాయన.
Nagababu New Journey.. బాటసారి సరికొత్త ప్రయాణం.!
అసలు విషయానికొస్తే, నాగబాబు తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.!
ఇన్నాళ్ళ నా జీవితంలో
ఎన్నో ఒడిదుడుకులను చూసి ఎన్నో విపత్తులని ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను..
ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు మరియు కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతో సహాయపడ్డాయి..
నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా తోటి ప్రజలకు సహాయపడాలని నిర్ణయించుకొని.. అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను..
ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు ఎదురైనా కాని..
నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే!
అందుకే ఇప్పటినుండి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకొన్నాను.
మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా..
ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది..
Nagababu
కొత్త ప్రయాణం అటువైపేనా.?
ఇదీ నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన. అంటే, నాగబాబు తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవబోతున్నారా.? 2024 ఎన్నికలో లక్ష్యంగా ప్రజా సేవకు నడుం బిగిస్తారా.? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
నాగబాబు గనుక యాక్టివ్ అయితే, మెగా అభిమానులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురాగలరు.. అది జనసేన పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
Also Read: Pawan Kalyan హీరోయిజంపై ఎందుకీ ‘ఏడుపు’.!
గతంలో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా ఈసారి రాజకీయాల్లో మరింత సీరియస్గా, శ్రద్ధగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మంచిదే.! చూద్దాం.. నాగబాబు అనే బాటసారి కొత్త ప్రయాణం ఎటువైపు.. ఎలా సాగుతుందో.!