Krithi Shetty Kollywood Calling తొలి సినిమా ‘ఉప్పెన’తోనే నటిగా మంచి మార్కులేయించుకుంది బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి.
పదహారణాల తెలుగమ్మాయిలా ‘ఉప్పెన’ సినిమాలోని బేబమ్మ పాత్రలో ఒదిగిపోయిన కృతి శెట్టి, తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చాలా చాలా బిజీగా వుంది.
మొన్నీమధ్యనే నాని హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాలోనూ, ఆ తర్వాత నాగచైతన్యతో ‘బంగార్రాజు’ సినిమాలోనూ కనిపించిన కృతి శెట్టి, తాజాగా తమిళ సినీ పరిశ్రమ నుంచి పిలుపుని అందుకుంది.
Krithi Shetty Kollywood Calling తమిళంలో డబుల్ ధమాకా.!
సూర్య హీరోగా బాల దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం కృతి శెట్టి పేరు ఫైనల్ అయ్యింది. బాల సినిమాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

నటీనటుల ప్రతిభకు సాన పెట్టడం మాత్రమే కాదు, ఈ విషయంలో నటీనటుల్ని చాలా కష్టపెట్టేస్తాడనే పేరుంది దర్శకుడు బాలకి.
సో, నటిగా కృతి శెట్టికి ఇది అసలు సిసలు పరీక్ష అని చెప్పొచ్చు. తనకు చాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టమనీ, బబ్లీ అమ్మాయి పాత్రల కంటే కూడా, నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలన్నదే తన ఆలోచన అనీ అంటోంది కృతి శెట్టి.
జోరు మామూలుగా లేదుగా.!
ఇదిలా వుంటే, తెలుగులో ‘ఆ ఆమ్మయి గురించి చెప్పాలి’ (Aa Ammayi Gurnchi Meeku Cheppali), ‘ది వారియర్’ (The Warrior) సినిమాలు చేస్తోంది కృతి శెట్టి.
‘ది వారియర్’లో రామ్ పోతినేని (Ram Pothineni) హీరో కాగా, ఈ చిత్రానికి లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఓ రకంగా బైలింగ్వల్ మూవీ. తమిళంలోనూ విడుదల కాబోతోందీ సినిమా.
Also Read: ‘ఆమె’కి వందనం.! మగువా.. నువ్వే ఈ జగమంతా.!
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో సుధీర్ బాబు (Sudheer Babu) సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti Mohana Krishna) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.