మాస్టర్ డిగ్రీ పొందిన పవన్ సతీమణి అన్నా కొణిదెల.!

 మాస్టర్ డిగ్రీ పొందిన పవన్ సతీమణి అన్నా కొణిదెల.!

Pawan Kalyan Anna Konidala

Anna Konidala Masters Degree.. జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల, మాస్టర్ డిగ్రీ అందుకున్నారు.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో వైభవంగా జరిగిన స్నాతకోత్సవంలో అన్నా కొణిదెల ఈ మాస్టర్ డిగ్రీని అందుకోగా, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.

శ్రీమతి అన్నా కొణిదెలకు ఇది రెండో మాస్టర్ డిగ్రీ కావడం గమనార్హం. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్)లో అన్నా కొణిదెల మాస్టర్స్ చేశారు.

మాస్టర్స్ పట్టా అందుకున్నా అన్నా కొణిదలను (Anna Konidala) అభినందించారు ఆమె భర్త పవన్ కళ్యాణ్.

Anna Konidala Masters Degree.. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో విద్య..

అన్నా కొణిదెల (Anna Konidela) రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఓరియంటల్ స్టడీస్‌లో హానర్స్ పట్టా పొందారామె.

ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత డిగ్రీ పొందారామె. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్‌గా వుంది.

కాగా, సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే మూడు భాషల్ని కూడా నేర్చుకున్నారామె.

మొదటి మాస్టర్స్ డిగ్రీ ఇలా..

ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో శ్రీమతి అన్నా కొణిదెల మొదటి మాస్టర్ డిగ్రీని సాధించడం జరిగింది.

కాగా, అన్నా కొణిదెల (Anna Konidela) రెండో మాస్టర్ డిగ్రీని సింగపూర్ యూనివర్సిటీ నుంచి పొందడంపై జనసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Also Read: డీఎన్ఏ రాజకీయం.! బొత్తిగా సిగ్గొదిలేశారు.!

గత కొంతకాలంగా, అన్నా కొణిదెల (Anna Konidala) చుట్టూ రాజకీయ ప్రేరేపిత విమర్శల్ని చూస్తున్నాం.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, మరీ ముఖ్యంగా పెళ్ళిళ్ళు, భార్య.. తదితర వ్యవహారాలపై నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం చూశాం.

ఇలాంటి హేయమైన రాజకీయ విమర్శల దాడిని తట్టుకుని, విద్యాభ్యాసం విషయంలోనూ, కుటుంబ బాధ్యతల విషయంలోనూ అన్నా కొణిదెల చూపిన శ్రద్ధని అభినందించాల్సిందే.

Digiqole Ad

Related post