RRR Ramcharan Jr NTR Domination:‘బాహుబలి’ సినిమా సమయంలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.?’ అన్న ప్రశ్న బాగా పాపులర్ అయ్యింది.
ఇప్పుడు అచ్చం అలానే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీయార్లలో ఎవరు ఎవర్ని డామినేట్ చేశారన్న ప్రశ్న చర్చనీయాంశమవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ చాలా మంచి నటుడు. మరి, రామ్ చరణ్ సంగతేంటి.? ‘రంగస్థలం’ సినిమా చూసినవారికి, చరణ్ నటన గురించి ఎలాంటి డౌటానుమానాలూ వుండవు.
ఎవరు ఎవర్ని ఎందుకు డామినేట్ చేస్తారు.?
అసలు చరణ్ (Mega Power Star Ram Charan), ఎన్టీయార్లను (Young Tiger NTR) రాజమౌళి ఓ సినిమాలోకి తీసుకోవడానికి ఎంతలా ఆలోచించాడు.? చాన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ సినిమా విషయమై తనకు ఎదురైన ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికరమైన రీతిలో సమాధానమిచ్చాడు.

‘అభిమానులు మారితే.. మల్టీస్టారర్ సినిమాలొస్తాయి. సినీ పరిశ్రమలో హీరోలందరి మధ్యా సఖ్యత వుంది. కొందరు అభిమానుల్లోనే అది లేదు. అదే అన్ని సమస్యలకూ కారణం..’ అని చెప్పాడు రాజమౌళి.
చరణ్, ఎన్టీయార్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా, తమ మధ్య చాలాకాలంగా స్నేహం వుందంటూ నెత్తీనోరూ బాదుకున్నాగానీ, కొందరు అభిమానులు మారలేదు, మారరు కూడా.
నిజానికి, మెజార్టీ అభిమానులు ఈ స్నేహాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకుంది.
అసలు ఈ డామినేషన్ సృష్టికర్తలెవరు.?
ఫలానా సీన్లో చరణ్ డామినేట్ చేశాడు కదా.! ఇదిగో ఈ సన్నివేశంలో చరణ్ తేలిపోయాడు కదా.? ఎన్టీయార్ కంటే చరణ్ బెటర్.. చరణ్ కన్నా ఎన్టీయార్ సూపర్..
ఇలాంటి రచ్చ సోషల్ మీడియాలో జరుగుతోంటే, అలాంటి చర్చకు ఆస్కారమిస్తోన్నవాళ్ళు చరణ్ (Ramcharan), ఎన్టీయార్ (Jr Ntr) అభిమానులే కారు.
ఓ మాఫియా.. ఇలా అభిమానుల మధ్య చిచ్చపెడుతోంది. ఆ మాఫియాని నడుపుతున్నదెవరన్నదానిపై ఇరువురు హీరోల అభిమానులకీ ఓ క్లారిటీ వుందనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: మ్యూజిక్ బాదుడు సరే.! ఈ గడబిడేంది తమన్.!
మల్టీస్టారర్ సినిమాలు ఇంకా ఇంకా రావాలి. ‘ఆర్ఆర్ఆర్’ కంటే పెద్ద సినిమాలు రావాలి.
ఇద్దరు హీరోలు కాదు, ముగ్గురు, నలుగురు హీరోలు కలిసి నటించే సినిమాలూ వస్తేనే.. తెలుగు సినిమా స్థాయి ‘ఆర్ఆర్ఆర్’ కంటే పదింతలవుతుంది.
అలా తెలుగు సినిమా ఉన్నతిని కోరుకోవాలి.. హీరోల్లానే అభిమానులూ కలిసిమెలిసి వుండాలి. వుంటుందని ఆశిద్దాం.!