Table of Contents
Virat Kohli Bengaluru Stampede.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకున్న విషయం విదితమే.
విరాట్ కోహ్లీ, గతంలో ఆర్సీబీకీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు మాత్రం, జట్టులోని ఆటగాళ్ళలో ఆయనా ఒకడు. అయినాసరే, తమ జట్టు కప్పు గెలిచిన ఆనందంతో, ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అంతేనా, మైదానంలోనే ఏడ్చేశాడు.. అదీ, మ్యాచ్ పూర్తవకుండానే.. అవి ఆనంద భాష్పాలేననుకోండి.. అది వేరే సంగతి.
Virat Kohli Bengaluru Stampede.. ఆనందం ఆవిరైంది.. తొక్కిసలాటతో..
ఆర్సీబీ కప్పు గెలిచిన దరిమిలా, విజయోత్సవ సంబరాలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో, తొక్కిసలాట జరిగింది.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది.
నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదా.? పోలీసులు సరైన భద్రత కల్పించలేదా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.
విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్టు చేయాలి.?
ఈ తొక్కిసలాట నేపథ్యంలో విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.
‘పుష్ప 2 ది రూల్’ తొక్కిసలాట నేపథ్యంలో ఓ మహిళ మృతి చెందితే, హీరో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

అప్పుడు అల్లు అర్జున్‌ని అరెస్టు చేశారు కాబట్టి, ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్టు చేయాల్సిందేనన్నది కొందరి వాదన.
అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ హీరో. ఆయన, ఆ రోజు సంధ్య థియేటర్ వద్దకు వెళ్ళడంతోనే తొక్కిసలాట జరిగింది. పోలీసులు వద్దంటున్నా, అల్లు అర్జున్ వెళ్ళడాన్నది ప్రధాన ఆరోపణ.
బెంగళూరు తొక్కిసలాట.. అసలేం జరిగింది.?
బెంగళూరు కథ వేరు. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ కూడా కాదు. నిర్వాహకులు వేరే వున్నారు, ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా వుంది. అదంతా పెద్ద కథ.

గెలిచిన టీమ్ సభ్యులు, విజయోత్సవాలకు వెళ్ళారంతే.! నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు ఏంటి.? పోలీసుల వైఫల్యం ఎంత.? ఇవన్నీ లెక్కలు తేలాల్సి వుంది.
Also Read: హరి హర వీర ‘ముల్లు’! ఆర్ నారాయణ మూర్తికి కూడా గుచ్చేసుకుంది!
ఒక్కటి మాత్రం నిజం.. మాస్ హిస్టీరియా అనండీ, ఇంకోటి అనండీ.. జనం ఎక్కువగా గుమికూడిన సందర్భాల్లో, ఈ తరహా తొక్కిసలాటల్ని నిలువరించడం అంత తేలిక కాదు.
చివరగా: కప్పు గెలిచిన ఆనందం కంటే, విజయోత్సవాల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడమే, విరాట్ కోహ్లీకి అయినా, ఆర్సీబీ జట్టు సభ్యులకు అయినా ఎక్కువ బాధను కలిగిస్తుంది.