Ram Charan Jr NTR Friendship: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో ఎన్టీయార్ అసంతృప్తితో వున్నాడట.. రాజమౌళి మీద గుర్రుగా వున్నాడట.. రామ్ చరణ్ పేరు వినడానికే ఇష్టపడటంలేదట.. తన పాత్ర నిడివిని రాజమౌళి, రామ్ చరణ్ కలిసి తగ్గించేశారని ఆవేదనతో రగిలిపోతున్నాడట.!
ఏంటీ, నిజమేనా ఇదంతా.? కాదు కాదు, హంబక్.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద నెగెటివిటీ కోసం ఓ వర్గం మీడియా పడుతున్న కష్టమిది.
తొలి రోజు సినిమా చూసేశాక, ‘హిట్టు కొట్టేశాం..’ అని ఎన్టీయార్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ఆ ఎన్టీయార్‌లో విచారం కనిపించింది ఓ వర్గం మీడియాకి.

సినిమా విడుదల కాకముందే మొదలైన నెగెటివ్ ప్రచారం, సినిమా విడుదలయ్యాక మరింత ఎక్కువయ్యింది. సరే, సినిమాల మీద పనిగట్టుకుని విష ప్రచారం చేయడమన్నది ఇటీవలి కాలంలో సర్వసాధారణమేననుకోండి.. అది వేరే సంగతి.
కానీ, చరణ్ అలాగే ఎన్టీయార్ లాంటి బిగ్ స్టార్స్ నటించిన అతి పెద్ద మల్టీస్టారర్ విషయంలో కుట్రపూరితంగా నెగెటివిటీని ఎందుకు ప్రచారం చేయాలి.? అంత ఓర్వలేనితనమెందుకు.?
Ram Charan Jr NTR Friendship స్నేహమేరా జీవితం.!
ఆ విషయాన్ని పక్కన పెడితే, ‘రామ్ లేకపోతే భీమ్ లేడు..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఎన్టీయార్ మంచి స్నేహితులు. ఇద్దరూ రామ్ అలాగే భీమ్ పాత్రల్లో నటించారు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం.

ఇదే, ఇక్కడే.. ఈ స్నేహం చాలామందికి నచ్చడంలేదు. సినిమా మీద వ్యతిరేకత కాదు, వీరిద్దరి స్నేహం మీద వ్యతిరేకత.. ఇద్దర్నీ ఎలాగైనా విడదీయాలన్న కుట్రతో ఓ వర్గం మీడియా అడ్డగోలు కథనాల్ని ప్రచారంలోకి తెస్తూనే వుంది.
‘చరణ్, మై బ్రదర్.. నువ్వు లేకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్టింగ్‌ని నేను ఊహించుకోలేను. రామరాజు పాత్రలో నువ్వు తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేను కూడా.
Also Read: గ్యాస్ ట్యాంకర్ అట.! ప్చ్.. Raashi Khanna కూడా అంతే.!
ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు, భీమ్ కూడా నువ్వు లేకుండా సంపూర్ణం కాదు..’ అని ఎన్టీయార్ వ్యాఖ్యానించాడంటే.. అదీ చరణ్ – ఎన్టీయార్ అనుబంధం.
చరణ్ (Ram Charan) – ఎన్టీయార్ (Jr NTR) కెమిస్ట్రీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాకి ఓ మ్యాజిక్‌లా పనిచేసింది. ఒకరు ఎక్కువా కాదు.. ఇంకొకరు తక్కువా కాదు.! రామ్ ప్లస్ భీమ్.. వెరసి ‘ఆర్ఆర్ఆర్’.!