Table of Contents
Kajal Agarwal.. ‘అమ్మాయే పుడుతుంది. అచ్చు అమ్మలాగే వుంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చు నాన్నలాగే వుంటాడు..’ పాట ఎక్కడో విన్నట్లుంది కదా.
రెట్రో సాంగ్ వెరీ పాపులర్ సాంగ్ అది. సరే, ఇప్పుడు మన టాపిక్‌లోకి వచ్చేద్దాం.
చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్‌కి అబ్బాయే ఎందుకు పుట్టాడు.?
కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్.. అక్క కన్నా ముందే పెళ్లి చేసుకుని ఓ అబ్బాయికి తల్లి అయ్యింది.
ప్రెగ్నెంట్‌గా వున్నప్పుడు ఆ చిన్నబాబుతో కలిసి కాజల్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వేదికగా ఆ ముద్దు ముచ్చట్లను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుని తెగ మురిసిపోయింది చందమామ.
Kajal Agarwal అబ్బాయిలంటే అందుకే అంత ఇష్టమట..
పెద్దమ్మ హోదాలో ఓ వైపు, కాబోయే తల్లిగా మరోవైపు.. చెల్లెలి కొడుకుతో తన ఆనందాల్ని, సరదా సమయాల్ని బాగా ఎంజాయ్ చేసింది కాజల్ అగర్వాల్.
అన్నింటికీ మించి కాజల్ అగర్వాల్‌కి అన్నదమ్ములు లేరు. ఇద్దరూ ఆడపిల్లలే.
సో, ఆ లెక్కల్లో కూడా కాజల్ ఫ్యామిలీకి అబ్బాయిలంటే చాలా చాలా ఇష్టమట. మొత్తానికి బేబీ బాయ్‌తో ఆ ముచ్చట తీర్చుకుంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).
కాజల్ తనయుడు పేరు తెలుసా.?
తనకు కూడా అబ్బాయే పుట్టాలని గట్టిగా కోరుకుంది కాబోలు. అచ్చు చందమామలాంటి అబ్బాయే పుట్టాడు కాజల్ అగర్వాల్‌కి.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
ఈ బుల్లి చందమామకి ‘నీల్’ అని నామకరణం చేస్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అందాల చందమామ.
తొలిసారి నీల్ తన ఛాతిపై పడుకున్న సమయంలో తల్లిగా తాను పొందిన అనుభూతి చాలా లోతైనది.. మాటల్లో చెప్పలేనిది.. అంటూ కాజల్ భావోద్వేగానికి లోనైంది.
రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కాజల్ గ్రేట్..
‘బిడ్డకు జన్మనివ్వడం అనేది నిజానికి అంత చిన్న విషయం కాదు.. మూడు రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను.. ఎప్పుడెప్పుడు నా బిడ్డను ఎత్తుకుందామా.. అన్న ఆత్రుతను ఎంతో ఆనందంగా అనుభవించాను..’ అని కాజల్ చెప్పుకొచ్చింది.
బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఇంతకు ముందులాంటి అందం, ఆకర్షణ నాలో లేకపోయినా, అమ్మగా నేను పొందిన ఆనందం కారణంగా ఇకపై అంతకు మించి అందంగా కనిపిస్తాను..’ అని కాజల్ (Kajal Aggarwal) చెప్పడం మరో విశేషం.